- Advertisement -
హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ -టు తిరుపతిల మధ్య ఈనెల 21వ తేదీ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రత్యేక రైలు (నెం.07597) కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి జూలై 6, 13, 20 ల్లో రాత్రి 10.20 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. మరో ప్రత్యేక రైలు (నెం.07598) తిరుపతి నుంచి జూలై 07, 14, 21 తేదీల్లో మధ్యాహ్నం 03.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 04.00 గం.లకు కాచిగూడకు చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.
- Advertisement -