Friday, November 22, 2024

బడుగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న సిఎం

- Advertisement -
- Advertisement -

BC Commission Member Kishore Goud praise on CM KCR

బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ ప్రశంసించారు. నూతనంగా జిల్లాకొకటి చొప్పున 33 బిసి మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ నిరుద్యోగుల కోసం 132 స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేయాలని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనాథ శరణాలుగా, సంక్షోభ నిలయాలుగా ఉన్న సంక్షేమ హాస్టళ్ళను విముక్తి కల్గించడం కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ విద్యార్థుల కోసం దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన కార్పోరేట్ విద్యను ఉచితంగా అందించడం జరుగుతోందని, అందులో ఉన్నత విద్యను కూడా అందించాలనే గొప్ప మనసుతో ముఖ్యమంత్రి వాటిని జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.

మహిళా విద్యను ప్రోత్సహించడం కోసం నూతనంగా జిల్లాకు ఒక బిసి మహిళా డిగ్రీ కళాశాల చొప్పున 33 కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం, వృత్తినైపుణ్యం పెంచడం కోసం కొత్తగా 132 స్టడీ సర్కిళ్ళ ఏర్పాటు నిర్ణయం లక్షలాది మంది బడుగు,బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమేనని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఐఎఎస్, ఐపిఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల కోసం నాలుగు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. ఇంత పెద్ద ఎత్తున చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కి కిసోర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News