- Advertisement -
న్యూఢిల్లీ : బ్యాంకాక్ ఢిల్లీ విస్తారా విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయింది. అయితే సింగిల్ ఇంజిన్‌తో విమానం సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ అయిన తరువాత పార్కింగ్ బేకు వెళ్తున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, సిబ్బంది అప్రమత్తమై టాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి విమానాన్ని తరలించారని విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. మంగళవానం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిందని డిజిసిఎ వెల్లడించింది.
- Advertisement -