100 కోళ్లు, రూ.13 లక్షలు స్వాధీనం
పరారీలో ఎపి టిడిపి మాజీ ఎంఎల్‌ఎ
మనతెలంగాణ, సిటిబ్యూరో : హైదరాబాద్ నగర శివారులో ఎపి చెందిన ప్రముఖులు కోడిపందా లు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు పోలీసులు దాడి చేసి 21మంది అరెస్ట్ చేశారు. కోళ్ల పందాలను ఎపిలోని టిడిపికి చెందిన మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు డిఎస్‌పి భీం రెడ్డి గుర్తించారు.
దీంతో ఘటనాస్థలంలో 100 కోళ్లు, రూ.13లక్షలతో పాటు 26 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… పటాన్‌చెరువు పెదకంజర్ల గ్రామంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. కోడిపందాలను ఎపికి చెందిన మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని ప్రభాకర్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
గత కొంత కాలం నుంచి పం దాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు బుధవారం దాడి చేశా రు. పోలీసులు వస్తున్న విషయం తెలియడంతో మాజీ ఎంఎల్‌ఎ చింతమనేని పరారు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కోడి పందాల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.