Friday, November 22, 2024

ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్- పవర్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్- పవర్ ఫెసిలిటీ సెంటర్ ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.  ఫ్రెంచ్ కంపెనీ ఈ ఫెసిలిటీ సెంటర్ ల కోసం 1200 కోట్లు పెట్టుబడి పెడుతోంది.   ఈ ఫెసిలిటీ సెంటర్ లో విమానాలకి సంబంధించిన ఇంజన్లను తయారు చేయడంతో పాటు రిపేర్ చేయనుంది. ఈ రెండు ఫెసిలిటీ సెంటర్ ల ద్వారా 1000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. మనదేశంలో విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ ల నిర్వహణ కేంద్రం హైదరాబాద్ లో పెట్టడం తెలంగాణకే గర్వకారణం. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లను తయారుచేసే అగ్రశ్రేణి కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతోంది. విమానాల్లో వాడే లీప్-1ఎ లీప్-1బి ఇంజన్లని హైదరాబాద్ ఫెసిలిటీ సెంటర్ లో తయారు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News