రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతల్ మెట్ హకీం హిల్స్ కాలనీలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతిని దుండగులు హత్యకు ప్రయత్నించారు. సుమియా బేగం(19)ను కారుతో గుద్ది చంపబోయారు. టైలరింగ్ శిక్షణ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతిని ఢీకొట్టిన వెంటనే గుర్తుతెలియని వ్యక్తులు పరారయ్యారు. బాధితురాలిని కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న సుమియాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితురాలి తలకు బలమైన గాయమైందని డాక్టర్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదామా? హత్యాయత్నమా ? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంగానే చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిని ప్రమించిన వ్యక్తే హత్యకు ప్రయత్నించాడని స్థానికులు చెబుతున్నారు.
A woman was injured after a car rammed into her on Wednesday at Chintalmet, Rajendra Nagar.
In the CCTV footage, a car can be seen ramming into the woman suddenly while she was walking on a side of the road. pic.twitter.com/brO5EV2gwC
— The Siasat Daily (@TheSiasatDaily) July 7, 2022