Tuesday, December 24, 2024

వైస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే: రేవంత్

- Advertisement -
- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ కు కాంగ్రెస్ నేతల ఘన నివాళి….

YSR Jayanthi date

హైదరాబాద్: వైస్సార్ చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడమేనని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు.  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ సిటీ సెంట్రల్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి టిపిసిసి అధ్యక్షులు ఎంపి రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, దాసోజు శ్రవణ్, కుసుమ కుమార్ కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైస్సార్ అని ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత వైస్సార్ అని పొగిడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రియంబర్స్ మెంట్, జలయజ్ఞం, ముస్లిం లకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైస్సార్ అని రేవంత్ రెడ్డి కొనియాడారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే వైస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. వైఎస్ఆర్ గొప్ప రాజనీతజ్ఞుడు అని, వైఎస్ఆర్ కు హైదరబాధ్ లో స్మృతివణం లేకపోవడం అవమానమన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి రాబోతుందని, రాగానే వైస్సార్ స్మృతివనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ యాదవ్, రోహిణ్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News