Wednesday, November 27, 2024

తెలంగాణ చరిత్ర

- Advertisement -
- Advertisement -

తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబం ధించి వివిధ పోటీ పరీక్షల్లో వినూత్నమైన ప్రశ్నలు అడుగుతు న్నారు. ఆ ప్రశ్నలు ఏ పుస్తకాల్లోనూ కనిపించవు. అయితే పోటీ పరీక్షల్లో ఎవరూ ఊహించని, చదవని కొన్ని ప్రశ్నలు మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించి కార్టూన్స్, నాటకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందులో భాగంగా కంభాలపల్లి చంద్రశేఖర్, మంత్రి శ్రీనివాసరావు కొండపల్లి శేషగిరి రావుల గురించి తెలుసుకుందాం..

Unemployed are getting ready for competitive exams

కొండపల్లి శేషగిరిరావు

కొండపల్లి శేషగిరిరావు పూర్వ వరంగల్ జిల్లాలోని పెనుగొండలో జన్మించారు.
చెట్లు, కాలువలు, చీమలు, జింకలు,పులులు, పక్షులతో ప్రభావితమైన శేషగిరిరావు నవాబు మెహదీ జంగ్ విశ్వభారతి శాంతినికేతన్‌కు పంపారు.
అక్కడ ఆయన నందలాల్ బోస్, అవినీంద్రనాథ్ టాగూర్ వద్ద శిష్యరికం చేశారు.
అఖిల భారత స్థాయి శిక్షణను పొందారు.
20వ శతాబ్దం తొలి రోజుల్లో ప్రారంభమైన అవ్యక్త చిత్రకళను అర్థం చేసుకొని, ప్రపంచానికి చెప్పగల నైపుణ్యం సాధించారు.

ప్రశ్న: సంతాల్ నృత్యం అనే చిత్రాన్ని వేసి, చిత్రకళా ప్రదర్శన చేసిన తెలంగాణ చిత్రకారుడు ఎవరు? (2)
1. పల్లెర్ల హనుమంతరావు
2. కొండపల్లి శేషగిరిరావు
3. ఈటూరి లక్షణరావు
4. చొప్పకట్ల చంద్రమౌళి

1949లో కొండపల్లి శేషగిరిరావు వేసిన సంతాల్ నృత్యం అన్న చిత్రం అఖిల భారత చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. 1958లో పరామర్శ అన్న చిత్రం బంగారు పతకాన్ని సాధించగా, క్షమ అన్న చిత్రం కలకత్తా చిత్ర ప్రదర్శనలో సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
కైరో, ఇటలీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శించబడ్డాయి.
దేశంలో ఇంచు మించు అన్ని రాష్ట్రాల్లో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శించ బడ్డాయి.
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన రూపాలను శేషగిరిరావు చిత్రాలో ప్రదర్శించారు
ముఖ్యంగా రాయగిరి కొండల రూపాలను చిత్రాల్లో ప్రదర్శించారు.
కాకి పడగలనే ఒక పురాతన చిత్రకళా సంప్రదాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.
ఆ కళాకారులకు ప్రభుత్వంలో గుర్తింపు తీసుకొచ్చిన చిత్రకారుడు శేషగిరిరావు.
రామప్ప దేవాలయంలోని నంది మెడ చుట్టూ ఉన్న హారాన్ని ఎంతో స్పష్టంగా చిత్రించిన చిత్రం నేటికీ ప్రామాణికంగా నిలిచింది.
సుమారు 60 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తుగల చిత్రం తెలంగాణలో ఉన్న అతిపెద్ద చిత్రంగా నమోదైంది.
ఈ కాన్వాస్ విశ్వమిత్రుని చిత్రంతో ప్రారంభమయి, భూర్గుల రామకృష్ణారావు చిత్రంతో పూర్తవుతుంది.
ఈ చిత్రం మధ్యలో తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి చిత్రం ఉంటుంది.
ఆ చిత్రానికి ఇరువైపులా తెలుగు నేలను ఏలిన సామ్రాట్టులైన శాతవాహనుడు, గౌతమీ పుత్ర శాతకర్ణిలతో పాటు, రుద్రమదేవి లాంటి చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి.
అలాగే బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడితోపాటు త్యాగయ్య, అన్నమయ్య లాంటి వాగ్గేయకారులున్నారు.
నన్నయభట్టు, వేమన మొదలైన కవులను కూడా చిత్రించారు. రజారాజ నరేంద్రుడు, శ్రీకృష్ణ దేవరాయలతో పాటు పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన కులీ కుతబ్‌షా, వరంగల్ కాకతీయ తోరణం, రామప్ప దేవాలయ నాగినులు, నాగార్జున సాగర చార్మినార్ లాంటివి ఎన్నో చిత్రించబడ్డాయి.
1980 నుంచీ భారత ప్రభుత్వం ఆయనను ప్రొఫెసర్ ఎమిరటస్‌గా గుర్తించి గౌరవించింది.
1995లో శేషగిరిరావు చిత్రించిన మాన్యువల్ పెయింటింగ్ ఇప్పటికీ భారతీయ విద్యాభవన్ భవనంపై చెక్కు చెరదకుండా ఉంది.
2003లో ఉల్బి ఆర్ట్ గ్యాలరీ వారు శేషగిరిరావును విశ్వకళా తపస్వి బిరుదుతో సన్మానించారు.

కంభాలపల్లి చంద్రశేఖర్
సూర్యాపేట జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్, తెలుగు కార్టూన్‌కి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు. అమెరికా ప్రభుత్వ ఆహ్వానంతో ఆదేశంలోని పలు రాష్ట్రాల్లో అధ్యయన పర్యటన చేసిన తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు.
ఈయన తన జీవితంలో 46 వేల కార్టూన్లు వేసారు. సుమారు పది భాషల్లో ఆయన కార్టూన్లు వెలువడ్డాయి.
1996 బెల్జియంలో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్ట్‌గా అవార్డు అందుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో ఉత్తమ కార్టూనిస్టు అవార్డును అందుకున్నారు.
తన తొలి కార్టూన్ 1984లో ప్రచురితమైందని ఆయన పేర్కొన్నారు.
తొలి రోజుల్లో చంద్రశేఖర్ కంభా అనే పేరుతో కార్టూన్లు వేస్తూ ఉండే వారు.
కంభా అనే పేరుతో అప్పడాల కర్ర టైపు కార్టూన్లు వేశారు.
తర్వాత రోజుల్లో మారిన తన ఆలోచన దృక్పథంతో శేఖర్ పేరుతో రాజకీయ కార్టూన్లు వేయడం మొదలుపెట్టారు.

ప్రశ్న: కంభా పేరుతో కార్టూన్లు వేసిన తెలంగాణకు
చెందిన కార్టూనిస్ట్ ఎవరు?(4)
1.సిరిప్రగడ భార్గవరావు 2. నీల జంగయ్య 3. మంత్రి శ్రీనివాసరావు 4. కంభాలపల్లి
చంద్రశేఖర్

కార్టూనిస్టుగా చంద్రశేఖర్ గీసిన వేలాది కార్టూన్లు దేశ విదేశాల్లో అనేక భాషల్లో వచ్చాయి.

ఒక ప్రాంతీయ భాషా పత్రిక కార్టూనిస్ట్‌కి.. ఇంతగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం అసాధారణం.

ప్రశ్న: గిది తెలంగాణా పుస్తక రచయిత? (1)
1. కంభాలపల్లి చంద్రశేఖర్
2. వెల్దుర్తి మాణిక్యరావు
3. సురవరం ప్రతాపరెడ్డి
4. ముకురాల రామిరెడ్డి

తెలుగు కార్టూనిస్టులకి ఎవరికి రాని అమెరికా ఆహ్వానం తనకి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న అవకతవకలు అన్నీ చమత్కారంగా చూపే కార్టూన్లతో కల్చర్ ఆఫ్ ఇండియా అనే పుస్తకం వేశారు.
ఆయన క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూనే సమాజంలోని కులవివక్షతను ఎండగడుతూ క్యాన్సర్ పేరుతో కార్టూన్ పుస్తకాన్ని తెచ్చారు.
దాదాపు రెండు ఏళ్లు క్యాన్సర్‌తో బాధపడిన చంద్రశేఖర్, సంకల్ప బలంతో క్యాన్సర్‌ని జయించే ప్రయత్నం చేసి, మే 19, 2014న కన్నుమూశారు. మే 20, కార్టూనిస్టు దినోత్సవానికి ఒక రోజు ముందు కన్నుమూసారు.

మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో జన్మించారు. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన మంత్రి శ్రీనివాసరావు తెలుగు నాటక రంగంలో ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు.
1952లో ఇండియన్ నేషనల్ థియేటర్, హైదరాబాద్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఆంగ్లనాటకాల వ్యాప్తికి కృషి చేసింది హరీంద్రప్రసాద్ ఛటోపాధ్యాయ. ఛటోపాధ్యయ జాతీయ నాట్య సంఘానికి అధ్యక్షులుగా కమలాదేవి వ్యవహరించారు.
కమలాదేవి ప్రోత్సాహంతో మంత్రి శ్రీనివాసరావు, ఏ.ఆర్ కృష్ణలు ఇండియన్ నేషనల్ థియేటర్ నాటకోత్సవాలను సిటీ కాలేజిలో ఘనంగా నిర్వహించారు.
ఇందులో బెల్లంకొండ రామదాసు మాస్టార్జీ నాటకాన్ని ప్రదర్శించారు.
మాస్టార్జీ నాటకం హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లో విశేషంగా ఆదరించడంతో మరిన్ని కొత్త నాటకాలు ఆవిష్కృతమయ్యాయి.
1957లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసింది.
ఇందులో మంత్రి శ్రీనివాసరావును అకాడమీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. నాటక రంగానికి శాస్త్రీయ పద్ధతిలో నటీనటులను తయారు చేయాలన్న సంకల్పంతో 1959లో నాట్య విద్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.
ప్రశ్న: ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ థియేటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు?(3)
1. 1949 2. 1951 3. 1952 4. 1954
మంత్రి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యం లో ఏ.ఆర్ కృష్ణ దర్శకత్వంలో 1964 తొలి రోజుల్లోనే మచ్చకటికం గొప్ప నాటకంగా ప్రదర్శించబడింది.
ఈ నాటకాన్ని హైదరాబాద్‌లోనే కాకుండా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట వంటి అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.
నాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఆహ్వానం మేరకు మృచ్ఛకటికం నాటకాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించారు.
ఈ ప్రదర్శన భారతీయ నాటక విమర్శకులను అబ్బురపరచింది.
ఈ ప్రదర్శన చూసిన రాష్ట్రపతి ప్రతి నటుడ్ని అక్కున చేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ అభినందించారు.
1961లో బ్రిటీష్ రంగస్థల నిపుణులు హెర్బట్ మార్షల్ బొంబాయిలో నిర్వహిస్తున్న నటశిక్షణ పాఠశాలలో ప్రత్యేక కోర్సును పూర్తి చేశారు.
ప్రశ్న:1963లో లండన్‌లోని బ్రిటిష్ డ్రామా లీగ్‌కు ఎంపికైన తెలంగాణ వ్యక్తి?(1)
1. మంత్రి శ్రీనివాసరావు
2. ఏ.ఆర్. కృష్ణ
3. బెల్లంకొండ రామదాసు
4. అబ్బూరి రామకృష్ణారావు
అక్కడ డైరీ ఆఫ్ ఫ్రాంక్ అనే ఆంగ్ల నాటకంలో ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషించి అభినయ ప్రదర్శనలో ప్రత్యేకతను చాటాడు.
అక్టోబర్ 9, 1974లో అకాల మరణం చెందాడు.
1963లో నటనలో ప్రత్యేక శిక్షణ నిమిత్తం లండన్‌లోని బ్రిటిష్ డ్రామా లీగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
భారత దేశం నుండి కేవలం నలుగురికి మాత్రమే అవకాశం చేసే ఈ కోర్సుకు అనేక వడ పోతల్లో మంత్రి శ్రీనివాసరావు ఎంపికయ్యారు.
ప్రశ్న: దక్షిణ భారతదేశంలోని తొలిసారిగా ఏర్పడిన రంగస్థల శాఖకు మొదటి శాఖాదిపతిగా నియమితులైన తెలంగాణ వ్యక్తి?(4)
1. సాక్షి రంగారావు
2. వంకాయల సత్యనారాయణ
3. అత్తిలి కృష్ణారావు
4. మంత్రి శ్రీనివాసరావు

పృథ్వికుమార్ చౌహన్
డైరెక్టర్, పృథ్విస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News