Friday, April 4, 2025

స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండె పోటు

- Advertisement -
- Advertisement -

vikram

చెన్నై: కోలీవుడ్ చిత్ర పరిశ్రమ  స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండె పోటు రావడంతో.. హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ  ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయనకు ఐసియూలో చికిత్స చేస్తున్నారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని,  అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ఇప్పటికే కరోనా బారినపడి విక్రమ్‌ ఈ మధ్యనే కోలుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ లాంచ్‌కు విక్రమ్‌ హాజరు కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News