వాహకత్వం(1/R):
వాహకానికుండే ఈ తత్వాన్ని వాహకత్వంగా కూడా సూచిస్తారు.
ఇది నిరోధ విలోమం(1/R)కి సమానం.
ప్రమాణాలు: 1/ohm
ఓమ్ నియమం
స్థిర ఉష్ణోగ్రత (t) వద్ద, వాహకంలోని విద్యుత్ ప్రవాహం(i)
ఆ వాహకం రెండు చివరల మధ్యనున్న విద్యుత్ పొటెన్షియల్ (v)కి అనులోమానుపాతంలో ఉంటుంది.
నిరోధ నియమాలు
నిరోధం వాహక స్వభావం, వాహక పొడవు, వాహక వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. నిరోధ నియమాలు 3 అవి
1. నిరోధం (R) వాహక స్వభావం మీద ఆధారపడి ఉంటుంది.
2. నిరోధం (R) పొడవుకు (L) అనులోమాను పాతంలో ఉంటుంది.
3. నిరోధం (R), వైశాల్యానికి (A) విలోమానుపాతంలో ఉంటుంది.
విశిష్ట నిరోధం(P)
ప్రమాణ పొడవు, ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం నిరోధాన్ని దాని విశిష్ట నిరోధం (P) అంటారు.
P=R.A/L ప్రమాణం: ohm meter
విద్యుద్దర్శిని
స్థావర విద్యుత్ ఉనికి తెలుసు కోవడానికి ఉపయోగించే సాధనాలు రెండు రకాలు.
1. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని
2. బెండు బంతి విద్యుద్దర్శిని
స్వర్ణపత్ర విద్యుద్దర్శిని
దీనిని కనుగొన్న శాస్త్రవేత్త బెన్నెట్
సజాతి పుంజాలు వికర్షించుకుంటాయి, అనే ధర్మం ఆధారంగా పనిచేస్తుంది.
ఇది సున్నితమైంది, స్వల్ప విద్యుదావేశాలను కూడా గుర్తిస్తుంది. దీనిని నిర్మించడం కష్టం.
బెండు బంతి విద్యుద్దర్శిని
ఇది సజాతి పుంజాలు వికర్షించుకుంటాయి, అనే ధర్మంపై ఆధారపడి పనిచేస్తుంది.
ఇది స్వల్ప విద్యుదావేశాలను గుర్తించలేదు. దీనిని సులభంగా తయారు చేయవచ్చు. దీనికి గాలి ప్రభావం నుంచి రక్షణ లేదు.
ప్రాథమిక ఘటాలు
ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం
వలయంలో ఘటాన్ని I I గుర్తుతో సూచిస్తారు.
వోల్టాఘటం
దీన్ని ఓల్టా అనే శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు.
దీనినే ప్రాథమిక ఘటం అని కూడా అంటారు.
ఇందులో విద్యుత్ విశ్లేషణంగా సజల సల్ఫూరిక్ ఆమ్లంను తీసుకుంటారు.
ధన ధృవం రాగి కడ్డీ
రుణధృవం జింక్ కడ్డీ
విద్యుచ్ఛాలక బలం 1.08 ఓల్టులు.
లోపం : స్థానిక ధృవీకరణం
లెక్లాంచి ఘటం
దీనిని 1865లో జార్జి లెక్లాంచి కనుగొన్నాడు.
ఇది ప్రాథమిక ఘటంలోని లోపాలను సవరించింది.
విద్యుత్ విశ్లేషణం = అమ్మోనియా క్లోరైడ్
ధనధృవం కర్బనకడ్డీ
రుణ ధృవం జింక్ కడ్డీ
విద్యుచ్ఛాలక బలం 1.46 వోల్టులు.
భెక్రోమేటి ఘటం
దీంట్లో పోటాషియం డైక్రోమేట్, సల్ఫూరిక్ ఆమ్లాల మిశ్రమంను తీసుకుంటారు.
ధనధృవం కర్బన కడ్డీ
రుణ ధృవం జింక్ కడ్డీ
విద్యుచ్ఛాలక బలం = 2 వోల్ట్
అనార్ద్ర ఘటం (డ్రై సెల్)
విద్యుత్ NH4CL ముద్ద.
ధనధృవం కర్బన కడ్డీ
రుణ ధృవం జింక్ కడ్డీ
విద్యుచ్ఛాలక బలం = 1.5 వోల్ట్.
i = q/t కూలుంబ్/సెకన్(లేదా) ఆంపియర్‌లు
ఆంపియర్
ఒక కూలూంబ్ ఆవేశం, ఒక సెకన్ కాలంలో ఏదైని ఒక వాహక మధ్యచ్ఛేదమును దాటితే..ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహించింది అని అంటారు.
విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్లలో అమ్మీటర్ A తో కొలుస్తారు.
విద్యుత్ పొటెన్షియల్
ఏకైక ధనాత్మక ఆవేశాన్ని అనంతం నుండి అంతరాళంలో ఒక బిందువు వద్దకు చేర్చడానికి వినియోగించిన పని, ఆ బిందువు వద్ద పొటెన్షియల్‌కు సమానం.
v=w/q=పని/ఆవేశం. ప్రమాణాలు : జౌల్/కూలూంబ్ = వోల్ట్.
వోల్ట్ నిర్వచనం
ఒక కూలూంబ్ ధనావేవాన్ని ఒక బిందువు నుండి మరో బిందువుకి చేర్చడానికి, ఒక జౌలు పని వినియోగిస్తే ఆ రెండు బిందువుల మధ్య పోటెన్షియల్ భేదం ఒక వోల్ట్ ఉందని అంటారు.
విద్యుచ్ఛాలక బలం
ఎలక్ట్రాన్‌లను అధిక పోటెన్షియల్ గల బిందువు వైపుకి తరలించడానికి విద్యుత్ ఘటం చేసే పనిని విద్యుచ్ఛాలక బలం అంటారు.
విద్యుచ్ఛాలక బలం కూడా ప్రమాణ ధనావేశంపై చేసే పని కాబట్టి దీనిని కూడా వోల్ట్‌లలోనే కొలుస్తారు.
విద్యుత్ వలయం
విద్యుత్ జనకం, శక్తి ఉపయోగించే విద్యుత్ సాధనాలను కలిపే వాహకాలతో ఏర్పడిన అమరికను సాధారణ విద్యుత్ వలయమని అంటారు.
ఘటాలు-శ్రేణి సంధానం
రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను చివరి నుంచి చివరకు కిందిపటంలో చూపిన విధంగా కలిపితే ఘటాలు శ్రేణి సంధానంలో ఉన్నాయని చెప్పవచ్చు.
E1,E2,E3 విద్యుత్‌చ్ఛాలక బలాలున్న ఘటాలను శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత విద్యుచ్ఛాలక బలం (E) విద్యుచ్ఛాలక బలాల మొత్తానికి సమానం.
E = E1+E2+E3
ఘటాలు-సమాంతర సంధానం
రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాల ధన ధృవాలన్నీ ఒక బిందువునకు, రుణ ద్వారాలన్నీ వేరే బిందువునకు పటంలో చూపినట్లు కల్పితే ఘటాలు సమాంతర సంధానంలో ఉన్నాయని అంటారు.
సమాంతర సంధానంలో ఘటాల విద్యుచ్ఛాలక బలాలు E1,E2,E3 అయితే ఫలిత విద్యుచ్ఛాలక బలం, విడి విద్యుచ్ఛాలక బలాల్లో ఏది గరిష్టమో దానికి సమానం అవుతుంది. ఫలిత విద్యుచ్ఛాలక బలం (E)= E1(or) E2(or) E3ల్లో గరిష్ట విద్యుచ్ఛాలక బలం ఉంది.
నిరోధం
వాహకంతో ఎలక్ట్రాన్ల స్వేచ్ఛా ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని నిరోధం అంటారు.
ప్రమాణాలు : ohm
గ్రీకు శాస్త్రజుడైన ఢేల్స్ ప్రయోగంతో ఎలక్ట్రిసిటీ అనే పదం వాడుకలోకి వచ్చింది. ఈయన సీమ గుగ్గిలం (అంబర్)ను ఉన్ని చర్మంతో రుద్దితే ఆరెండింటికీ ఆకర్షించే గుణం వస్తుందని నిరూపించాడు.
గాజు కడ్డీని సిల్కు వస్త్రంతో రుద్దడం వల్ల దానికి ఆకర్షించే గుణం వస్తుందని గిల్బర్ట్ నిరూపించాడు.
స్థావర విద్యుత్
వస్తువులను ఒక దానితో మరొకదాన్ని సరైన రీతిలో రుద్దినప్పుడు ఘర్షణ వల్ల విద్యుదీకరణ చెంది వ్యతిరేక ఆవేశాలను పొందుతాయి.
విద్యుత్ ఆవేశాలు వస్తువులపై స్థిరంగా ఉండటం వల్ల ఈ భాగాన్ని స్థిర విద్యుత్ లేదా స్థావర విద్యుత్ అని అంటారు.
విద్యుత్ బలాల సూత్రాలు
సజాతి పుంజాలు వికర్షించుకుంటాయి. విజాతి పుంజాలు ఆకర్షించుకుంటాయి.
ఐలీ వంశీకృష్ణ,
నంద్యాల అకాడమీ డైరెక్టర్