Tuesday, November 26, 2024

ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల బక్రీద్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister Koppula Bakrid wishes to Muslims

 

హైదరాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ వాసులు, దేశ విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలైన ముస్లిం సోదర సోదరీమణులకు మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు రంజాన్ మాదిరిగానే బక్రీద్ (ఈద్ ఉల్ అధా) ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని, ఇది శాంతి, సహనం, దయ, కరుణ, ప్రేమ, ఐక్యమత్యం, మానవత్వాన్ని బోధిస్తున్నదని అన్నారు. ఆర్థిక స్థోమత కలిగిన వారు ఈ పండుగ సందర్భంగా మేకలు, గొర్రెలను ఖుర్బాని ఇచ్చి మాంసాన్ని పేదలు, బంధుమిత్రులకు పంచి పెడతారని, విందు భోజనం పెడతారని, తమ పూర్వీకులను కొలుస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో మైనారిటిలు, అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అభద్రతకు లోనుకాకుండా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనారిటిలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతోందన్నారు. రంజాన్ సందర్భంగా విందులు ఏర్పాటు చేస్తూ పేదలకు దుస్తులు అందజేస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు ఆసక్తి చూపే యువతకు 20 లక్షల చొప్పున ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డల పెళ్ళిళ్లకు షాదీముబారక్ పథకం ద్వారా లక్షా 116 రూపాయులు ఉచితంగా ఇస్తున్నామన్నారు. దీంతో బాల్యవివాహాలు పూర్తిగా తగ్గిపోయి ఉన్నత విద్యావంతులవుతున్నారని తెలిపారు. బక్రీద్ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News