Monday, December 23, 2024

ఈశ్వరీబాయి కుటుంబాన్ని పరామర్శించిన సునీతా లక్ష్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

Sunita Lakshmareddy visited Ishwaribai's family

హైదరాబాద్ : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీ బాయి కుటుంబాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఈశ్వరీ బాయి భర్త కుమ్ర రాజు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. అతను శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారని కటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారని, వైద్యులు చికిత్స చేస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందనిట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లకా్ష్మరెడ్డి ఇంద్రవెల్లిలోని వారి స్వగృహంలో ఈశ్వరీబాయి కుటుంబాన్ని పరామర్శించారు. ఈశ్వరీబాయి భర్త పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ సందర్బంగా ఖానాపూర్ ఎంఎల్‌ఎ రేఖ నాయక్, కమిషన్ సభ్యులు కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల సద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News