మనతెలంగాణ/హైదరాబాద్ : కాచిగూడ- టు నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లను జూలై 20 వరకు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- నిజామాబాద్ రైలు (07594), నిజామాబాద్- కాచిగూడ రైలు(07595) రద్దయినట్టు అధికారులు పేర్కొన్నారు. జూలై 21 నుంచి నిజామాబాద్ – నాందేడ్ రైలు (07853), నాందేడ్- నిజామాబాద్ రైలు (07854)ను పునరుద్ధరించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్- రామేశ్వరం మధ్య 18 వీక్లీ స్పెషల్ రైళ్లు..
ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆగస్టు- నుంచి సెప్టెంబర్ నెలల్లో సికింద్రాబాద్- టు రామేశ్వరంల మధ్య 18 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 2,9,16,23,30, సెప్టెంబర్ 6,13,20, 27 తేదీల్లో (మంగళవారం) సికింద్రాబాద్‌లో బయలుదేరి ప్రత్యేక రైలు(07685) గురువారం రామేశ్వరం చేరుకుంటుందని రైల్వే అధికారులు వివరించారు. అలాగే ఆగస్టు 4,11,18,25, సెప్టెంబర్ 1,8,15,22,29 తేదీల్లో (గురువారం) రామేశ్వరంలో బయలుదేరే ప్రత్యేక రైలు(07686) శనివారం సికింద్రాబాద్ చేరుతుందని అధికారులు పేర్కొన్నారు.