న్యూఢిల్లీ: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, దైవ విగ్రహాన్ని సమర్పించారు. దీనికి ముందు శుక్రవారం వారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన ఇంట్లో కలుసుకున్నారు. నేడు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలుసుకున్నారు. షిండే, ఫడ్నవీస్‌లు జూన్ 30న పదవీ బాధ్యతలు స్వీకరించారు. శివసేనలోని షిండే వర్గం, ఫడ్నవీస్ నేతృత్వంలో బిజెపి వర్గం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకే సర్కారును కూల్చి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. శివసేన చీలక ముందు 55 ఎంఎల్‌ఏలను కలిగి ఉండింది. దాదాపు 40 మంది శివసేన ఎంఎల్‌ఏలు షిండేకు మద్దతు ఇవ్వడంతో శివసేన చీలిపోయింది. చీలిక వర్గాన్ని కొత్తగా ఎన్నికైన మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ కూడా గుర్తించారు. బిజెపి మద్దతుతో షిండే జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. జూలై 4న విశ్వాస తీర్మానాన్ని నెగ్గారు.
దీనికి ముందు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశాక న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో షిండే తమది బలమైన ప్రభుత్వం అన్నారు. “మాకు 164 ఎంఎల్‌ఏల మద్దతు ఉంది. కాగా ప్రతిపక్షానికి కేవలం 99 ఎంఎల్‌ఏల మద్దతు మాత్రమే ఉంది. మా వర్గంలో ఉన్న ఎంఎల్‌ఏలకు ఎంవిఏ ప్రభుత్వంలో ముప్పు ఉండింది. అందుకే మేము ఈ చర్యకు దిగాము. బిజెపి, శివసేనల మధ్య ఉన్నది సహజమైన కూటమి. మేము మహారాష్ట్రను ముందుకు నడుపుతాము” అన్నారు.
The Chief Minister of Maharashtra Shri @mieknathshinde and the Deputy Chief Minister Shri @Dev_Fadnavis called on PM @narendramodi. @CMOMaharashtra pic.twitter.com/i2ljZTeuFB
— PMO India (@PMOIndia) July 9, 2022