Saturday, November 23, 2024

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police have solved case of software engineer's murder

హైదరాబాద్ : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణరెడ్డి హత్య కేసును ఛేదించారు పోలీసులు. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, ఆగ్రహంతో హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్ డిసిపి శిల్పవల్లి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కెపిహెచ్‌బిలో ఉంటున్న ఎపిలోని ప్రకాశం జిల్లా, రాజపాలెంకు చెందిన నారాయణరెడ్డి నగరంలోని కెపిహెచ్‌బిలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 27వ తేదీన మిస్సింగ్ కాగా బంధువులు 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు హత్యకు గురికావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఎపిలోని ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, పెద్దలకుంటపల్లి గ్రామానికి చెందిన గాజులపల్లి శ్రీనివాస్ రెడ్డి, నగరంలోని సరూర్‌నగర్‌లో ఉంటున్నాడు, కమలాపాటి కాశిరావు ఎలక్ట్రికల్ పనిచేస్తున్నాడు, షేక్ ఆశిక్ మల్కాజ్‌గిరిలో ఉంటూ చదువుకుంటున్నాడు.

ఎపిలోని ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, రాజువారి పాలెం, కొండపల్లికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కలిసి హత్యకు ప్లాన్ వేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి అన సొంత గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె రవళిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ స్థాయికి సరిపోడని, ఆర్థికంగా లేరని వెంకటేశ్వర్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత రవళిని తల్లిదండ్రులు బలవంతంగా ఇంటికి తీసుకుని వెళ్లారు. తర్వాత కూడా యువతి నారాయణరెడ్డితో తరచూ మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే తనకు వేరే వారితో వివాహం చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పింది. దీంతో నారయణరెడ్డి తను రవళితో ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను బంధువులు, ఆమె స్నేహితులకు వాట్సాప్‌లో పంపించాడు. దీంతో యువతికి వచ్చే సంబంధాలు అన్ని వెనక్కి పోతున్నాయి. తమ కూతురికి వచ్చే సంబంధాలు అన్ని చెడగొడుతున్నాడని కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి హత్యకు ప్లాన్ వేశారు. తమ బంధువు దిల్‌సుఖ్‌నగర్‌లో ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డికి రూ.4.50 హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారు. నిందితుడు ఆశిక్, కాశీతో కలిసి నారాయణరెడ్డికి మద్యం తాగించి హత్య చేశారు. హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితులను కర్నూలులో అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News