కింగ్ అక్కినేని నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రం ప్రమోషన్‌లను ‘కిల్లింగ్ మెషిన్’తో ప్రారంభించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో నాగార్జున తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. యువ సంగీత దర్శకులు భరత్-సౌరభ్ ఇచ్చిన బీజీయం ఈ గ్లింప్స్‌ని నెక్స్ లెవెల్‌కి తీసుకు వెళ్ళింది. కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ‘ది ఘోస్ట్’పై మరిన్ని భారీ అంచనాలు పెంచింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ ‘శివ’ కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్, నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ “ఈ సినిమాలో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్‌ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు టెర్రిఫిక్‌గా వుంటాయి.
చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎమోషన్, సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. “నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ యాక్షన్‌లో అద్భుతంగా ఉంటారు. ఈ సినిమాలో 12 భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు వున్నాయి. నాగార్జున వాటినిగా సూపర్ ఫాస్ట్‌గా చేశారు”అని తెలిపారు. పుస్కుర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ “యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది, నాగార్జున చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని అద్భుతంగా తీశారు”అని పేర్కొన్నారు.
Killing Machine Glimpse Out from ‘The Ghost’