Monday, December 23, 2024

కార్లపైకి దూసుకెళ్లిన డిసిఎం

- Advertisement -
- Advertisement -

12 injured in Road accident in Kovur Palli

ముగ్గురి మృతి, ఐదుగురికి గాయాలు
చౌటుప్పల్ సమీపంలోని ధర్మాజీగూడెం
స్టేజీ వద్ద దుర్ఘటన ప్రమాదంలో
రెండు కార్లు ధ్వసం 6 కి.మీ మేర
నిలిచిపోయిన ట్రాఫిక్

మన తెలంగాణ /చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మాజిగూడెం గ్రామ స్టేజీ వద్ద 65 వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా మరో 5 గురు గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలిసింది. హైద్రాబాద్ నుంచి విజయవాడ వైపు ఇనుప సీకుల లోడుతో వెళుతున్న డిసిఎం వాహనం ధర్మాజిగూడెం గ్రామ స్టేజీ వద్దకు చేరుకోగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డివైడర్‌ను దాటుకుని వెళ్లి హైద్రాబాద్ వైపు వెళుతున్న కార్లపైకి దూసుకెళ్లి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కారు డిసిఎం కిందపడి నలిగిపోగా మరో కారు కూడా ధ్వంసమైంది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా 5 గురు గాయాల పాలయ్యారు. పరిస్థితి విషమంగా వున్న ఇద్దరిని చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన అక్కడికి చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపుల సుమారు 6 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ ఎసిపి ఉదయ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు విజయ్ మోహన్, విజయ్ కుమార్ లు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సుమారు 3 గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాద ఘటనకు సంభంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News