- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సోమేష్ కుమార్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Advertisement -