Friday, November 22, 2024

ఆశచూపి.. దోచేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Public awareness of financial crimes by police

సామాన్యులే టార్గెట్‌గా మోసాలు

హైదరాబాద్: సామాన్యుల అశలను ఆసరాగా చేసుకుని నిలువునా మోసంచేసే మాయాగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆర్థిక నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాలకు శ్రీకారం చూడుతోంది. ప్రజలకు లేనిపోని ఆశలతోపాటు ఆత్యాశలు కల్పించి మోసాలకే పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక నేరాలకు పాల్పడే వారు సామాన్యులను టార్గెట్‌గా చేసుకుని తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ అర చేతిలో వైకుంఠం చూపిస్తారని పోలీసు బాసులు వివరించారు. తీరా డబ్బులు డిపాజిట్ చేశాక ముఖం చాటేస్తారు, ఆపై వారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులు వివరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఇస్తాం, ఫలానా షేర్లు కొంటే 10 రెట్ల లాభం వంటి ఆకర్షణీయ ప్రకటనలు చూసి మోసపోవద్దని, ఈజీ మనీ కి అర్రులు చాచరాదని, ఏదేని సంస్థలో పెట్టుబడు పెట్టాలనుకున్నప్పుడు లేదా షేర్ల కొనుగోలులో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు.

ఆ కంపెనీ నిజంగా ఉందా, సదరు ప్రకటన ఎవరిచ్చారు, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ టి కూడుకున్నవి, ఎవరూ మీకు ఊరికే లాభాలు ఇవ్వరని గమనించాలన్నారు. అదేవిధంగా ప్రముఖ కంపెనీలలో ఫ్రాంఛైజీ లలో పెట్టుబడులని ఫోన్ లు చేసి ఊరించి ముందుగా తమ ఖాతాలలో అందినంత డబ్బులు వేసుకుంటారని, సొమ్ములు డిపాజిట్ చేసిన అనంతరం వారికి ఫోన్ చేసినా ఏమాత్రం ఫలితం ఉండదని పోలీసులు వివరిస్తున్నారు. అలాగే సెల్ టవర్ల ఏర్పాటు, తక్కువ వడ్డీకి లోన్ లు ఇప్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఇలా దొరికితే చాలు మోసాగాళ్లు ఇట్టే మోసాలు చేస్తారని తెలిపారు. మోసగాళ్లు ఫోన్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా ముందుగా సంప్రదిస్తారని, వారి ఎత్తులను పసిగడితే మోసపోకుండా ముందే జాగ్రత్త పడే అవకాశాలున్నాయన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు ఫలానా లాటరీలో కోట్లు తమ అకౌంట్లలో పడ్డాయని, కేవలం ప్రాససింగ్ ఫీ, కస్టమ్స్ తదితర వాటికి కొంత అమౌంట్ పంపించాలని ఎవరు చెప్పినా అది ఖచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు. ఒక్కసారి వారి మాయ మాటలను నమ్మితే దశలవారీగా డబ్బుని వసూలు చేసి చివరకు చేతులేత్తేస్తారన్నారు. సదరు లాటరీ టికెట్‌కు మనదేశంలో అనుమతి ఉందా? అసలు లాటరీ టికెట్ కొన్నారా ? అన్న ప్రశ్నలను వారికి వారే వేసుకోవాలన్నారు. అదేవిధంగా అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి విషయాలను అడిగినప్పుడు.. ముందుగా అడిగే వారి క్రిడెన్షియల్స్, పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు. ఈక్రమంలో అసలు మీరెవరు?, ఎందుకు ఫోన్ చేశారు? నా ఫోన్ నంబర్ మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నలను సంధించాలన్నారు.

ప్రముఖ కంపెనీలలో ఫ్రాంఛైజీ లలో పెట్టుబడులని ఫోన్ లు చేసి ఊరించి ముందుగా తమ ఖాతాలలో అందినంత డబ్బులు వేసుకుంటారని, ఆ తర్వాత ఫోన్ చేసినా సమాధానం కరువవుతుందని గుర్తించాలన్నారు. అలాగే కొందరు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతుంటారని, మీ తరపున తాము షేర్ లను కొని ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తామని నమ్మించి మోసం చేస్తారన్నారు. అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతిరోజు డాలర్లతోపాటు ఏడాది తరువాత పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందని అమాయకులను ఆర్థికంగా ముంచుతారన్నారు. గ్రీన్‌గోల్డ్‌యోటెక్’ పేరుతో కంపెనీ ప్రారంభించారని, పల్లీల నుంచి నూనె తీసి కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుందని, నూనెతోపాటు పిప్పి కూడా కొనుగోలు చేస్తామన్న ప్రకటనలు నమ్మరాదని, అలాంటి ప్రకటనలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు, కాల్స్ వస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు 9490617310 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News