Saturday, November 23, 2024

ఖార్కివ్‌లో రష్యా బాంబు దాడులకు ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Ukraine

దొనేత్సక్: ఈశాన్య ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌పై రష్యా బాంబు దాడులు (షెల్లింగ్ దాడి) చేయడంతో సోమవారం ముగ్గురు మరణించగా, 22 మంది గాయపడ్డారని అక్కడి ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. రష్యా అనేక రాకెట్ లాంచర్ల ద్వారా రాకెట్లను ప్రయోగించడంతో నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయని రాష్ట్రపతి కార్యాలయ అధికారి తెలిపారు. దీనికి  ముందు, జవానులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక అపార్ట్‌మెంట్ భవనం శిథిలాల నుండి శవాలను వెళికి తీశారు. ఐదు అంతస్థుల భవనంపై రష్యా రాకెట్ తో దాడి జరుపగా ఆదివారం 15 మంది మృతి చెందగా,  ఒక చిన్నారి సహా రెండు డజన్ల మంది వ్యక్తులు చిక్కుకుపోయారని భయపడ్డారు.

దొనేత్సక్  ప్రాంతంలోని చాసివ్ యార్ పట్టణంలో జరిగిన ఈ దాడిని “మరో తీవ్రవాద దాడి” అని ‘రష్యాను ఉగ్రవాదానికి స్పాన్సర్‌గా నియమించాలని’ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News