Sunday, December 22, 2024

భార్యపై అనుమానం…. కుమారుడిపై కిరోసిన్ పోసి

- Advertisement -
- Advertisement -

young man suicide in Old City in Hyderabad

అమరావతి: భార్యపై అనుమానంతో కుమారుడిపై కన్నతండ్రి కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగాలోని హరిజనవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నుంచి భార్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. భార్య తనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిందేమోనని అనుమానంతో కుమారుడు మహేష్(09) చేత తండ్రి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. కుమారుడు అపస్మారక స్థితిలో ఉండడంతో బాలుడి అమ్మమ్మ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయం లేదని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి వరకు భార్య రాకపోవడంతో మళ్లీ కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు తండ్రి. అతడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. బాలుడికి 60 శాతం శరీర భాగాలు కాలిపోయాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎస్‌ఐ రామాంజనేయులు స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News