Sunday, December 22, 2024

హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

First Day First show movie

 

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వర రావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్ ఆసక్తికరంగా వుందని ప్రశంసించిన ఆయన, ప్రాజెక్ట్‌కు పనిచేసిన యంగ్ టీమ్‌ని అభినందించారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా విడుదల గురించి హిందీ వాయిస్ ఓవర్‌లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దీంతో ఖుషి సినిమా విడుదలైన సమయంలో జరిగిన కథగా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోదని టీజర్ చూస్తే తెలుస్తోంది. శ్రీకాంత్ రెడ్డి తన తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సంచితా బాసు అందంగా కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News