Friday, December 20, 2024

కామారెడ్డిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four died due to electric shock in Kamareddy

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో భార్య,భర్త సహా ఇద్దరు పిల్లలున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిసరాలను పరిశీలించారు. ఇంట్లో విద్యుత్ తీగలు తగిలి ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతులను హైమద్(35), పర్వీన్(30), మహిమ్(06), అద్వాన్(04)గా నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News