- Advertisement -
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలోని ఐలాండ్ లో చిక్కుకున్న తొమ్మిది మంది వ్యవసాయ కూలీలను రక్షించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఆదేశించారు. పనుల కోసం వెళ్లి గోదావరి మధ్య గట్టు ప్రాంతంలో కూలీలు చిక్కుకున్నారు. ప్రస్తుతం బోర్నపల్లి వద్ద గోదావరి శివారులో 9 మంది కూలీసులున్నారు. గోదావరి నది ప్రమాదం పెరగడంతో కూలీలు అక్కడే ఉండిపోయారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూలీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టాయి. హెలికాప్టర్ ద్వారా కూలీలను తీసుకొచ్చేదుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సంఘటనాస్థలంలో కలెక్టర్ రవి, ఎస్సీ సింధూశర్వ పర్వేవేక్షిస్తున్నారు.
- Advertisement -