మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం ద.మ.రైల్వే సిపిఆర్వో సిహెచ్ రాకేష్ పేర్కొన్నారు. సికింద్రాబాద్- టు నరసాపూర్, నరసాపూర్- టు వికారాబాద్‌ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైలు (నెం. 07631 జూలై 16, 23, 30 తేదీల్లో (శనివారం) రాత్రి 11.30 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:35 గం.లకు నరసాపూర్‌కు చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07632) జూలై 17,24,31 తేదీల్లో (ఆదివారం) రాత్రి 08.00 గం.లకు నరసాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గం.లకు వికారాబాద్ చేరుకుంటుంది.
పలు స్టేషన్‌లలో స్టాప్‌లు
సికింద్రాబాద్ టు నరసాపూర్ (3 సర్వీసులు) ప్రత్యేక రైలు నెం.07631 కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వేస్టేషన్లలో ఆగుతాయి. అలాగే నరసాపూర్ టు వికారాబాద్ (3 సర్వీసులు) ప్రత్యేక రైలు నెం.07632 పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ఆగుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 19,20 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్- టు తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూలై 19వ తేదీ మంగళవారం సాయంత్రం 18.40 గంటలకు ప్రత్యేక రైలు(07433) హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50కు తిరుపతి చేరుకుంటుందన్నారు. జూలై 20వ తేదీన సాయంత్రం 17.20 గంటలకు (రైల్ నెంబర్: 07434) తిరుపతిలో బయలుదేరి, తర్వాత రోజు ఉదయం 08.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైళ్లు నల్లగొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా నడుస్తాయని అధికారులు తెలిపారు. అలాగే తిరువనంతపురం- టు సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ సమయాన్ని ఆగస్టు 16 నుంచి సవరిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.