Thursday, November 14, 2024

మాజీ ఇన్స్‌స్పెక్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

Sensational things in Inspector Nageswara Rao's remand report

ఆధారాలు చెరిపేందుకు యత్నించిన ఇన్స్‌స్పెక్టర్
బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వాహణ, వాంగ్మూలం నమోదు
అత్యాచారం జరిగిన గదిలో వెంట్రుకలు, దుప్పటి, గాజులు స్వాధీనం చేసుకున్న క్లూస్ టీం
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించిన పోలీసులు
దర్యాప్తులో నేరం అంగీకరించిన నాగేశ్వరరావు…?

మనతెలంగాణ, హైదరాబాద్ : అత్యాచారం, ఆయుధచట్టం, హత్యాయత్నం కేసులో అరెస్టైన మారేడ్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో నేరం చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. వెంకటరమణకాలనీలోని బాధితురాలి ఇంట్లో 9.30 గంటలకు బాధితురాలిపై అత్యాచారం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు, ఆమె నుంచి స్టేట్ మెంట్‌ను తీసుకున్నారు. గదిలో నుంచి వెంట్రుకలు, దుప్పటి, గాజులు, ఇన్స్‌స్పెక్టర్ డ్రెస్, సర్వీస్ రివాల్వర్, లోదుస్తులను నాగేశ్వరరావు ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు.

బాధితురాలి ఇంటి సమీపంలోని సిసిటివి ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బాధితురాలిని, ఆమె భర్తను కారులో తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎసిపి పురుషోత్తం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం వైపు రోడ్డులో ఉన్న సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు నాగేశ్వరరావు కారు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకునేందుకు వనస్థలిపురం పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. కోర్టు నుంచి అనుమతి రాగానే కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

ఆధారాలు చెరిపేసేందుకు యత్నం…
బాధితురాలిపై అత్యాచారం చేసిన తర్వాత నాగేశ్వరరావు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దుస్తులను ఉతుక్కున్నాడని, ఏమీ తెలియనట్లు మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విధులు నిర్వర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియడంతో వెంటనే పరారయ్యాడు. కొత్తపేట, గ్రీన్‌హిల్స్ కాలనీలోని నాగేశ్వరరావు ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News