- Advertisement -
మెదక్: వర్షాలు, వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఆర్థిక ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు
- Advertisement -