చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంలోని మూడు సింహాల రూపురేఖలపై బహుభాషా ప్రముఖ నటుడు, నిర్మాత ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్ట్ ఆస్కింగ్ పేరిట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలపై ట్విటర్ వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా జాతీయ చిహ్నంపై రాజుకున్న వివాదంపై స్పందించారు. ఇంతకు ముందు, ఇప్పుడు అనే మకుటంతో శాంత స్వరూపులుగా ఉండే శ్రీరాముడు, హనుమంతుడి బొమ్మలు ఉగ్రరూపాలుగా మారడంతోపాటు జాతీయ చిహ్నంలోని మూడు సింహాలు కూడా ఎలా క్రౌర్యంగా మారిపోయాయో చూపుతో ఆయన చిత్రాలు పెట్టారు. ”మనం ఎక్కడకు వెళుతున్నాము” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ గత సోమవారం నూతన పార్లమెంట్ భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
”ఉగ్ర” సింహాలపై ప్రకాష్ రాజ్ అసహనం
- Advertisement -
- Advertisement -
- Advertisement -