Saturday, November 23, 2024

న్యాయ సమీక్షాధికారం

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ పరిరక్షణ హక్కు (ఆర్టికల్-32):

Constitution india telugu general knowledge

ఈ హక్కును బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి త్మ/హృదయం వంటిది అని వ్యాఖ్యానించారు.
ఇది హక్కులకే హక్కు వంటిది.
32వ ఆర్టికల్ ప్రకారం సుప్రీం హక్కుల ఉల్లంఘనకి రిట్లు జారి చేస్తుంది.
ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర అన్ని రకాల హక్కులకు రిట్లు జారీ చేస్తుంది. అనగా రిట్లు జారీ చేసే విషయంలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకే ఎక్కువ అధికారాలున్నాయి.
రిట్: అనగా ఆదేశం/ఆజ్ఞ అని అర్థం
1. హెబియస్ కార్పస్
హెబియస్ కార్పస్ అనగా you have the body.
అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలని చెబుతుంది.
అనగా అక్రమ అరెస్టును నివారిస్తుంది.
నోట్: ఇది ప్రైవేట్ వ్యక్తులకి, విదేశీయులకు వర్తించదు.
2. మాండమస్
మాండమస్ అనగా do your duty.
ఒక అధికారి తన విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వహించాలని కోర్టు జారీ చేసే రిట్టు. అధికారులను క్రియాశీలకంగా చేసే రిట్టు.
3. కోవారంట్
what is your authority (నీ అధికారం ఏంటి)
ఎవరైనా ఒక అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడితే లేదా తనకు లేని అధికారాలు చెలాయిం చితే ఈ రిట్టు జారీ చేస్తారు.
4. ప్రొహిబిషన్
తనకు అధికారం లేని కేసును ఏదైనా కోర్టు స్వీకరించినపుడు పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకు జారీ చేసే రిట్టు.
నోట్: హైకోర్టుకు సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది.
5. సెర్షియోరరి
సెర్షియోరరి పై స్థాయి కోర్టు కిం ది స్థాయి కోర్టుకు జారీ చేస్తుంది.
కేసును తనకు బదిలీ చేయమని లేదా ఇతర కోర్టుకు బదిలీ చేయమని రిట్లు జారీ చేస్తుంది.

ప్రాథమిక హక్కుల లక్షణాలు

1. ప్రాథమిక హక్కులు సార్వాత్రిక మైనవా? అందరికీ వర్తిస్తాయా..?
కొన్ని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. అవి 14, 17, 20, 21, 22, 23, 25
2. ప్రాథమిక హక్కులు పరిమితమా..? అపరిమితమా..?
పరిమితమైనవి (నిరపేక్షమైనవి)
3. ఈ హక్కులకు పరిమితులు విధించవచ్చు?
ప్రాథమిక హక్కులకు పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
ఫండమెంటల్ రైట్స్‌ను తొలగించవచ్చా..?
వీటిని తొలగించవచ్చు (పార్లమెంట్‌కి అధికారాలుంటాయి)
ఉదా: 44వ సవరణ ఆస్తి హక్కు
4. ప్రాథమిక హక్కులు శాశ్వతం కాదు
నేషనల్ ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు 20, 21 నిబంధలు తప్ప మిగతా వాటిని రాష్ట్రపతి రద్దు చేస్తారు.
5. ఇవి ప్రాధానంగా నకారాత్మకం (నెగెటివ్ మోడ్)
ఇవి ప్రభుత్వానికి పరిమితులు సూచిస్తాయి.
ముఖ్యంగా వ్యక్తి స్వామ్యాన్ని ఉద్దేశించి ఉన్నాయి.
6. ఇవి రాజకీమయ ప్రజాస్వామ్యాన్ని ఆసిస్తాయి
7. ప్రాథమిక హక్కులను సవరించవచ్చా?
సవరించవచ్చు. పార్లమెంట్ వీటిని సవరించే అధికారం కలిగి ఉంది.

 

న్యాయసమీక్ష-
న్యాయస్థానాల క్రియాశీలత
ఇండియాలో తొలి న్యాయసమీక్ష కేసు శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు .
కోర్టు స్వయంగా కేసు స్వీకరిస్తే సుమోటోగా పేర్కొంటారు.
నాగరాజు వర్సెస్ యూనియన్‌ఆఫ్ ఇండియా కేసులో ఎస్సి,ఎస్టి వర్గాలకు ఉద్యోగాల ప్రమోషన్స్‌లో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది.
ప్రైవేట్ సంస్థల్లో కూడా ఒబిసికి విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
లిల్లి థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్షపడ్డ ప్రజాప్రతినిధులు తక్షణమే తమ సభ్యత్వం కోల్పోతారు.
శాంతి సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కులో భాగమే అని పేర్కొంది.
అనగా గోప్యతను 21 (జీవించే హక్కు) ఆర్టికల్‌లో భాగంగా గుర్తించింది.

ప్రాథమిక హక్కుల విస్తరణ.. సుప్రీంకోర్టు తీర్పులు
యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
శంకరీ ప్రసాద్ 1వ రాజ్యాంగ సవరణను సవాలు చేశాడు.
ఆర్టికల్ 368 కింద చేసే రాజ్యాంగ సవరణ చట్టాలు ఆర్టికిల్ 13 కిందికి రావు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
గోలక్‌నాథ్ కేసు (1967)
పంజాబ్‌లో అధికారులు ఈయన భూమిని 31ఎ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.
గోలక్ నాథ్ 31ఎ ను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
అసలు రాజ్యాంగంను సవరించే అధికారం ప్లార్లమెంట్‌కు లేదని తీర్పునిచ్చింది.
ఆర్టికల్ 368 ప్రకారం చేసే సవరణ ఆర్టికల్ 13 కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది.
సవరణ చేయాలంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసుకుని సవరించికోండని వ్యాఖ్యానించింది.
ఇప్పటి నుంచి ఈ తీర్పు అమలులో ఉంటుందని పేర్కొంది.
24వ రాజ్యాంగ సవరణ : పార్లమెంటుకి ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది.
కేశవానంద భారతి కేసు (1973)
పార్లమెంట్‌కు రాజ్యాంగం సవరించే అధికారం ఉంది. కాని ఆ సవరణలు రాజ్యాంగ మౌలిక నిర్మాణంకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగ నిర్మాణంలో భాగం. రాజ్యాంగ మౌళిక నిర్మాణం
ఇది రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. కాని రాజ్యాంగంలో ఇది విస్తరించబడి ఉంది.
ఈ విషయాన్ని కేశవానంద భారతి కేసులో న్యాయస్థానం తొలి సారి పేర్కొంది.
42వ సవరణ : పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగం అయినా సవరించే అధికారం కలిగి ఉంది. ఈ సవరణని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించరాదు. పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. దీంతో న్యాయస్థానాలు న్యాయ సమీక్షాధికారం కోల్పోయాయి.
మినర్వమిల్స్ కేసు (1980)
w పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలిగి ఉంది. ఆ సవరణని ఏ కోర్టులో ప్రశ్నించరాదు అనే విషయం చెల్లదని పేర్కొంది. దీంతో న్యాయసమీక్షాధికారం పునరుద్దరించుకుంది.
w అనగా న్యాయ సమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం అని పేర్కొంది.
ఎస్‌ఆర్ బొమ్మై కేసు(1994)
w లౌకికత్వం కూడా రాజ్యాంగ మౌలిక నిర్మాణమే అని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News