- Advertisement -
హైదరాబాద్: బైక్ మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెహిన్(23), ఒబేద్(22) అనే యువకులు బైక్‌పై ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్‌కు వెళ్తుండగా హనుమాన్ గుడి సమీపంలో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే వారు చనిపోయారు. మృతులు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పంజాగుట్ట ఎస్‌ఐ ఉపేందర్ తెలిపాడు.
- Advertisement -