- Advertisement -
మహేశ్వరం: సీనియర్ ఆడిటర్ శైలేంద్రసింగ్ శుక్రవారం ఎసిబి వలకు చిక్కారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో రూ.50 వేలు లంచం తీసుకుంటా పట్టుబడ్డాడు. మహేశ్వరం మండలం అమీర్ పేట పంచాయతీ ఆడిట్ లెక్కలు అనుకూలంగా రాసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -