న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం బ్యాలట్ పేపర్లను ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ముద్రించారు. ఓటు వేసే ఎంపిలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ పేపర్, శాసనసభ్యులకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్ ఇస్తారు. జూలై 18న పోలింగ్ జరుగుతుంది, జూలై 21న ఫలితాలు వెలువడతాయి. ఒక్కొక్క ఎంపి ఓటు విలువ 700 కాగా, ఎంఎల్‌ఎ ఓటు విలువ సంబంధిత రాష్ట్ర జనాభానుబట్టి ఉంటుంది. ఓటు విలువనుబట్టి లెక్కించడానికి వీలుగా వేర్వేరు రంగుల్లో ఈ బ్యాలట్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న గడిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాధాన్యతను నమోదు చేయాలి. ఎన్‌డిఎ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. ఎంఎల్‌సిలు, నామినేటెడ్ ఎంపిలు, నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. పోలింగ్ సోమవారం పార్లమెంటు భవనం, రాష్ట్రాల శాసన సభ భవనాల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.
ఎంపిలు, ఎంఎల్‌ఎలకు వేర్వేరు రంగుల్లో బ్యాలట్ పేపర్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -