Tuesday, January 7, 2025

బాలికపై కారులో గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Girl gang-raped in moving car in delhi

ఢిల్లీలో దారుణం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల సామూహిక అత్యాచార ఘటన జరిగింది. స్థానిక వసంత్ విహార్ ప్రాంతంలో కారు ప్రయాణిస్తున్న దశలోనే 16 ఏండ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది. అయితే రెండు రోజుల తరువాత విషయాన్ని పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు ద్వారా తెలిసింది. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పోక్సో చట్టం పరిధిలో కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఒంటరిగా వెళ్లుతున్న బాలికను ఈ ముగ్గురు తమ కారులో ఎక్కించుకుని తిప్పినట్లు కారు వసంత్ విహార్ నుంచి మహిపాల్పూర్ వరకూ వెళ్లుతున్న సమయంలో అత్యాచారానికి దిగినట్లు వెల్లడైంది. అపరిచితుల వెంబడి తాను వెళ్లానని, మార్గమధ్యంలో వారు తనకు మద్యం తాగించారని ఈ బాలిక తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News