- Advertisement -
మోపాల్: తనను ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు, యువతి గొంతు కోసిన దారుణ సంఘటన నిజమామాబాద్ జిల్లా మోపాల్ శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నిందితుడిని సంజయ్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా సంజయ్ యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. గొంతుకోసిన సంజయ్ యువతికి దూరపు బంధువు. రేండేళ్ల క్రితం ఓ వివాహంలో యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -