కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ట్విట్టర్లో నిలదీసిన కెటిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ఈసారి ఆయన ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. ‘ఇదా మీ భాష?’ అంటూ కొన్ని వ్యాఖ్యలను ఉదాహరించారు. “ ప్రధాని నిరసనకారులను ఆందోళన్ జీవి’ అని పిలవడం మంచిదా?, యూపి సిఎం చేసిన ‘80-20’ ఓకేనా?, మహాత్మా గాంధీని బిజెపి ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉందా?, రైతు నిరసనకారులను ఉగ్రవాదులని అవమానించడం సరైనదేనా?, ‘గోలీమారో(బూతు)….’అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? అంటూ పరోక్షంగా ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. లోక్‌సభ సెక్రటరియేట్ తాజాగా పార్లమెంటులో నిబంధన ప్రకారం ఉపయోగించకూడని పదాల కూర్పు బుక్‌లెట్‌ను విడుదలచేసింది. దాని నేపథ్యంలో మంత్రి ఈ ట్వీట్ ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. త్వరలో పార్లమెంటు వానా కాలం సమావేశాలు ఆరంభం కానున్నాయి.
Parliamentary language of NPA Govt
✅ PM calling protesters “Andolan Jeevi” is fine
✅” Goli Maaron Saalon Ko” by Minister is okay
✅ “80-20” by UP Chief Minister is okay
✅ Denigration of Mahatma Gandhi by BJP MP is fine
✅ Farmer protesters insulted as “Terrorists” is fine pic.twitter.com/0Q4nfUmuET— KTR (@KTRTRS) July 16, 2022