న్యూఢిల్లీ : కోర్టు విచారణలకు ప్రముఖ న్యాయవాదులు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు వసూలు చేస్తే సామాన్యుడు ఎలా చెల్లించగలడని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పేరొందిన న్యాయవాదులు అధిక ఫీజులు గుంజితే దేశంలో పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం అందుబాటులో లేకుండా పోతుందన్నారు. జైపూర్‌లో శనివారం జరిగిన అఖిలభారత న్యాయ సేవల అథారిటీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సుప్రీం కోర్టులో సాధారణ ప్రజలు భరించలేని విధంగా కొందరు న్యాయవాదులు ఫీజు వసూలు చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బీజేపీ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బేరసారాలు, ప్రలోభాలతో ప్రభుత్వాలను మార్చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో అత్యంత విషమ పరిస్థితి నెలకొందని, అసలు తన ప్రభుత్వం ఎలా మనగలిగిందనేది తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని కమలనాధుల తీరును ఎండగట్టారు.
బడా లాయర్ల ఫీ ‘జులుం’తో సామాన్యుడికి దూరమౌతున్న న్యాయం : కిరణ్ రిజిజు
- Advertisement -
- Advertisement -
- Advertisement -