- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్ జిల్లాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్ శనివారం తనను తాను కాల్చుకోడానికి ముందు తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కోర్టు విచారణకు ఆదేశించింది. జిల్లాలోని దేవిక ఘాట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఘటన జరిగింది.
జమ్మూకాశ్మీర్ లో గత 24 గంటల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. పూంచ్‌లో శుక్రవారం జరిగిన ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.కానిస్టేబుల్ భూపేంద్ర సింగ్ తన సహోద్యోగులపై కాల్పులు జరపడంతో ఒక హెడ్ కానిస్టేబుల్ , ఇద్దరు కానిస్టేబుళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు ఈ వివరాలు వెళ్లడించారు. నేడు గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించామని, వారు ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని కూడా ఆయన వివరించారు.
- Advertisement -