- Advertisement -
నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా, హీరో నితిన్ హైదరాబాద్‌లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియోలో ’మాచర్ల నియోజకవర్గం’ డబ్బింగ్‌ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా పప్పు స్టూడియో గ్రాండ్‌గా లాంచ్ అయింది.
ఈ స్టూడియోలో మొదట డబ్బింగ్ జరుపుకుంటున్న చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’ కావడం విశేషం. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. ’మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
Macharla Niyojakavargam Movie Dubbing Starts
- Advertisement -