Monday, December 23, 2024

‘ఏ దేశమేగినా’ ఈ నేల రుచి మరవొద్దు

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఆర్‌ఐలకు
ఇంటి రుచులు,
మహిళల సాధికారతే
లక్షంగా పనిచేస్తున్న
అథెంటిక్ సంస్థ
210 దేశాలకు
తెలుగు సంప్రదాయ
వంటకాలు
30మంది
మహిళలకు ఉపాధి

మన తెలంగాణ/హైదరాబాద్: ఏ దేశమేగినా.. ఎందుకాలిడి నా.. చేతి వంట రుచిని, మాతృభూమి వంటకాల ఘుమఘుమలను ఎవరూ మరచిపోలేరు. అమెరికాలో ఉన్నా.. అండమాన్‌లో ఉన్నా తెలు గు వంటకాల రుచుల కోసం అర్రులు చా చని తెలుగువారు ఉండరు. ప్ర పంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు ఇంటి రుచుల ను చూపించడంతో పాటు.. మ హిళా సాధికారత సాధించడమే లక్షంగా పనిచేస్తున్న దేశీ అ థెంటిక్ అనే సంస్థ మన తెలుగింటి వంటలను విశ్వవ్యాప్తం చేస్తున్నది. ఆ విశషాలేమిటో తె లుసుకుందాం.. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారికి దక్షిణ భా రతీయ వంటకాలను ఇంటి వద్ద కే అందిస్తున్నామని దేశీ అథెంటి క్ వ్యవస్థాపకుడు, సిఈఓ రామ్‌వేమిరెడ్డి తెలియజేశారు. దేశీ అ థెంటిక్ మూడో వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం బే గంపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంస్థ ప్రతినిధులు సౌరభ్ రామ్‌దొరై, ఉగంధర్ సబ్బినేని,వరప్రసాద్ సూరికూచితో కలిసి ఆయన మాట్లాడారు.

యుఎస్‌ఎతో పాటు 210 దేశాల్లో స్థిరపడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు తెలుగు సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయ వంటకాలు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, సీజన్ వారీగా ప్రకృతి అందించే వాటిని అర్డర్ చేసిన నాలుగు రోజుల్లో అందజేస్తున్నామని అన్నారు. ప్రవాసాంధ్రులు వారి దేశాల్లో గృహప్రవేశం, వార్షికోత్సవాలు, వివాహాలు, సారె వంటి కార్యక్రమాలకు దేశీ అథెంటిక్ వంటకాలను అందజేస్తుందన్నారు. విదేశాల్లో శుభ కార్యక్రమాలకు హైదరాబాద్ నుంచి అందిస్తున్నట్లు తెలిపారు.వడియాలు, పాపడ్, సకినాలు, అరిసెలు, చేగోడీలు, అన్నమయ్య లడ్డూ, గోంగూర పచ్చడి, మురుకులు, అటుకుల మిశ్రమం, చికెన్ ఊరగాయ, పల్లి పొడి, ఇడ్లీ కారం పొడితో పాటు 170 రకాల రుచులను అందిస్తున్నట్లు తెలిపారు. దేశీ అథెంటిక్ ప్రధానంగా దేశీ కళలు, హస్తకళలు, చేనేత, సాంస్కృతిక సాహిత్యం, పాత ఆటల సామగ్రిని ప్రవాసాంధ్రుల ఇంటికి చేర్చేందుకు వారధిగా నిలుస్తుందన్నారు.

ఆన్‌లైన్ వేదికగా మూడు సంవత్సరాల్లో ప్రవాస భారతీయ 38 వేల కుటుంబాలకు హైదరాబాద్ నుంచి వంటకాలను అందజేశామని తెలిపారు. ప్రతి నెలా 10 పార్శిళ్లు విదేశాలకు పంపించడంతో 2.8 కోట్ల వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. www.desiauthentic.comలో ఆర్డర్ చేసిన వెంటనే నాలుగు రోజుల్లో విదేశాల్లో ఉన్నవారికి తెలుగు, దక్షిణ భారతీయ సంప్రదాయ వంటకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వంటకాలను నేరుగా తయారు చేసే మహిళల నుంచి సేకరించి.. విదేశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల దాదాపు ౩౦ మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. శాకాహార, మంసాహార వంటకాలను దేశీ అథెంటిక్ అందిస్తునట్లు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News