న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి మిగిలిన ఘర్షణ పాయింట్లలోని సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో భారత్, చైనా ఆదివారం 16వ రౌండ్ అత్యున్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించనున్నాయి. వాస్తవాధీన రేఖ యొక్క భారతదేశం వైపున ఉన్న చుషుల్ మోల్డో సమావేశ స్థలంలో చర్చలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య గతంలో చర్చలు మార్చి 11 న జరిగాయి. తాజా రౌండ్ చర్చలలో దేప్‌సాంగ్ బల్గే , డెమ్‌చోక్‌లలోని సమస్యల పరిష్కారాన్ని కోరడంతో పాటు మిగిలిన అన్ని ఘర్షణ పాయింట్‌లలో వీలైనంత త్వరగా దళాలను ఉపసంహరించుకోవాలని భారతదేశం ఒత్తిడి చేస్తుందని భావిస్తున్నారు.
India and China to hold 16th round of Corps Commander level talks today#India #China #ITVideo pic.twitter.com/ipNUMK20bl
— IndiaToday (@IndiaToday) July 17, 2022