మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వరక్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హైదరాబద్‌లో ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు శరత్ మండవ, దివ్యాంశ కౌశిక్, నాజర్, సుదీర్ వర్మ, త్రినాథ రావ్ నక్కిన, వంశీ, కళ్యాణ్ చక్రవర్తి, సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా కొనసాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ… దర్శకుడు శరత్ అద్భుతమైన సినిమా తీశారు. ట్రైలర్ అందరికీ నచ్చింది. దివ్యాంశ కౌశిక్ అందంగా కనిపించింది అని అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ… రవితేజ మాస్ మహారాజా మాత్రమే కాదు మంచి మనసున్న మహారాజా. చాలా దర్శకులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్ దర్శకులని చేశారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ టీజర్, సాంగ్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. దర్శకుడు శరత్ అద్భుతంగా తీశారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది అని తెలిపారు. దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ… ట్రైలర్ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. ఈనెల 29న వస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రేక్షకులను అన్ని రకాలుగా అలరిస్తుంది అని పేర్కొన్నారు.
‘Ramarao On Duty’ Movie Trailer Released