Saturday, November 23, 2024

ఎస్‌ఐ-కానిస్టేబుల్ పరీక్షలో.. ముఖ్యమైన టాపిక్స్

- Advertisement -
- Advertisement -

TS Police si and constable exam dates released

ఎస్‌ఐ/కానిస్టేబుల్ పరీక్ష రాసే వారికి ఈ కొద్దీ రోజుల ప్రిపరేషన్ చాలా కీలకం. ఎందుకంటే ఆగస్టు 7న ఎస్‌ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష జరుగనుంది. ఈ పరిక్షలకు కేవలం కొద్దీ రోజులే సమయం ఉంది. ఇది రివిజన్ చేసుకునే టైమ్..ఈ కొది రోజుల ప్రిపరేషన్ ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలో చూద్దాం.
క్వాలిఫై కావాలంటే వ్యూహం ఇదే
అభ్యర్థులు క్వాలిఫై అయ్యే వ్యూహం సాధారణంగా రెండు విధాలుగా ఉంటుంది.
1. రీజనింగ్, అర్థమెటిక్‌ను నమ్ముకొని ఉండటం, అత్యధిక మంది అభ్యర్థులు ఈ కోవకే చెందుతారు.
2. జనరల్ స్టడీస్ అంశాలను చదువుకుని విజయం సాధించేవారు.
జనరల్ స్టడీస్‌లో
ఏ అంశాలు ఫోకస్ చేయాలి
కరెంట్ ఈవెంట్స్‌లో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత
ఈ అంశం మీద దాదాపు 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అయితే సిలబస్‌లో ఎక్కడ కూడా ప్రాంతీయ అంశాలు అని చెప్పలేదు. కాని కనీసం 5 ప్రశ్నలైన ప్రాంతీయ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు! ఇక్కడ ప్రాంతీయ అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అని అర్థం.
సిలబస్‌లో కరెంట్ ఈవెంట్స్ అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యమైన అంశాల మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
గత ప్రశ్నపత్రాల అనుభవం ఏం చెబుతోంది!
దాదాపు ఒక ఏడాది కరెంట్ అఫైర్స్ అంశాలు చూసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ఒక ఏడాది పాటు కరెంట్ అఫైర్స్ అం టే మే 15, 2021 నుండి జూన్ 15, 2022 వరకు కరెంట్ అఫైర్స్ అంశాలను కవర్ చేసుకుంటే చాలు. ఈ విషయాన్ని గత ప్రశ్న పత్రాల ఆధారంగానే అంచనా వేయవచ్చు.
జాతీయాంశాల్లో ఇవి కీలకం
సుప్రీం కోర్టు నూతన న్యాయమూర్తులు, మహిళా న్యాయమూర్తులు, గతంలో తెలుగు ప్రధాన న్యాయమూర్తులైనవారు.
ప్రధాన ఎన్నికల కమిషన్ చైర్మన్, నీతి అయోగ్ డిప్యూటీ ఛైర్మన్.
వివిధ రాష్ట్రాలలో నూతన ముఖ్యమంత్రులు కొత్తగా ఎన్నికైనవారు.
వివిధ రాష్ట్రాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యంగా మహిళ ప్రధాన న్యాయమూర్తులు.
జాతీయ స్థాయి వ్యక్తులు ఈ మధ్యనే మరణిస్తే వారి మీద ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా సంగీతానికి, కళలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ముఖ్యమంత్రులు మొదలైనవారు.
భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత హోదాలో ఉంటే వారికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.
తరచుగా వార్తల్లో వచ్చే వ్యక్తులు, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో, మతసంబంధ విషయాల్లో తరచుగా మాట్లాడేవారు.
జాతీయ స్థాయిలో జ్ఞాన పీఠం అవార్డు అందుకుంటే వారి పేర్లు, రచన, ఏ రాష్ట్రానికి చెందినవారు.
గతంలో జ్ఞాన పీఠం అవార్డును అందుకుని గతేడాది కాలంలో మరణించినవారు.
రక్షణశాఖకు సంబంధింన అవార్డులు అశోకచక్ర, కీర్తి చక్రలను ఒక ఏడాది కాలంలో ఎవరు అందుకుంటే వారి పేర్లు.
పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న వారి పేర్లు, వారు ఏరంగంలో అవార్డును అందుకున్నారో ఆయా రంగాల పేర్లు చూసుకోవాలి.
పద్మభూషణ్ అవార్డును అందుకున్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు ముఖ్యంగా మహిళలు, వారి రంగాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి.
పద్మశ్రీ అవార్డును అందుకున్నవారు చాలా మంది ఉంటారు. కాని మన రాష్ట్రానికి చెందిన వారు పద్మశ్రీ అవార్డును అందుకుంటే వారి పేర్లు చూసుకోవాలి.
క్రీడల రంగానికి చెందినవారి పేర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది.
పుస్తకాలు, రచయితల మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్యకాలంలో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విడులైన పుస్తకాలు చూడాలి.
అలాగే మాజీ కేంద్రమంత్రులు, ప్రధాన మంత్రులు పుస్తకాలు రాసినా వాటిని కూడా అడుగుతారు.
జాతీయ స్థాయిలో కొన్ని ప్రదేశాలు వార్తల్లోకి వస్తే వాటిపై ప్రశ్నలొస్తాయి. ఉదాహరణకు పాంగాంగ్ సరస్సు, లఢక్ ప్రాంతం, డామన్, డయ్యూ మొదలగునవి.
అంతర్జాతీయ అంశాల్లో ఇవి ముఖ్యం
అంతర్జాతీయ వ్యక్తులు ముఖ్యంగా వివిధ దేశాలకు నూతన ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యంగా మహిళ ప్రధాన మంత్రులు, దేశాధ్యక్షులు.
అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు ముఖ్యంగా కొత్తగా ఎన్నికైనవారు.
అంతర్జాతీయ సదస్సులకు సంబంధించినవి కూడా చాలా ముఖ్యం. సదస్సు ఏదేశంలో జరిగింది. దానిలో భాగస్వామ్యం ఉన్న దేశాలు చూసుకోవాలి.
ఆ సదస్సులో భారతదేశం భాగస్వామ్య దేశమా? కాదా..? అనే అంశాలమీద దృష్టిపెట్లాలి.
అంతర్జాతీయ అవార్డులూ చూసుకోవాలి.
ఉదాహరణకు మ్యాన్ బుర్ ప్రైజ్, పులిట్జర్ ఫ్రైజ్, రామన్‌మెగసెసే అవార్డు, ఆస్కార్ అవార్డులు మొదలైనవి.
2021వ ఏడాదికి చెందిన నోబెల్ ఫ్రైజ్‌లు కూడా ముఖ్యం.
ఇటీవలె వచ్చిన కొత్త ట్రెండ్ ఏమిటంటే ఒకే ప్రైజును ఒకరికి సగం, మరో ఇద్దరికి సగం ఇస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుంటే మంచి మార్కులు వస్తాయి.
నోబెల్ ప్రైజులకు సంబంధించిన అంశాలలో టెన్నిస్ ఓపెన్స్ చాలా ముఖ్యం.
అంతర్జాతీయ వార్తలకు సంబంధించి వాటి సరిహద్దు దేశాలను, వాటితో సంబంధం ఉన్న దేశాలను చదువుకోవాలి.
క్రీడల్లో భారతదేశానికి వచ్చిన అవార్డులు చూడాలి.
ఉదాహరణకు బాక్సింగ్ రంగంలో, బ్యాడ్మింటన్, మహిళల క్రికెట్, ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్.

జనరల్ సైన్
జనరల్ సైన్స్‌కి సంబంధించి 8,9,10వ తరగతి పుస్తకాలు చదవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి డైనమిక్ అంశాల కంటే స్టాటిక్ అంశాల మీదనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
వ్యాధులకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఉదాహరణకు కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, టైఫాయిడ్..మొదలైనవి.
కరోనా వైరస్‌కి సంబంధించి వివిధ దేశాలలో గుర్తించిన కరోనా రకం గురించి చదువుకోవాలి.

ఇండియన్ జాగ్రఫీ
ఈ సబ్జెక్టులో భారతదేశ నైసర్గిక స్వరూపం నుంచే దాదాపు 40 శాతం ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది.
జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్ కేంద్రాలను ముఖ్యంగా వార్తల్లో వచ్చిన అంశాలను చూసుకుంటే సులభంగా మార్కులు సాధించవచ్చు.
వివిధ రకాల అడవులు, చిట్టడవులు, కోస్తా ప్రాంతాలు, ముఖ్యమైన నదులు, వాటి ఉపనదులను చదువుకోవాలి.
అట్లాస్‌ను ముందు పెట్టుకుని భారతదేశంలో రాష్ట్రాల స్వరూపం, కేంద్రపాలిత ప్రాంతాల స్వరూపం, ముఖ్యంగా ఈ శాన్యభారత రాష్ట్రాల సరిహద్దులను చూసుకోవాలి.

ఇండియన్ ఎకానమీ

పాండమిక్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బాగా చూసుకోవాలి.
గత ఏడాది కాలంలో వార్తల్లో వచ్చిన ఆర్థిక అంశాలమీద ఎక్కువగా దృష్టి పెట్టాలి.
ఎక్కువగా ప్లానింగ్, నీతి ఆయోగ్, సంక్షేమ పథకాల మీద అత్యధికంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా భారతదేశ ఆర్థిక సర్వే 202122ను, బడ్జెట్ 202223ను చదువుకొని వెళితే మంచి మార్కులు సాధించవచ్చు.

తెలంగాణ ఉద్యమం
ఈ అంశం మీద దాదాపు 2o ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. దీనికి తెలుగు అకాడమీ పుస్తకంతోపాటు ఉద్యమంపై ప్రామాణికమైన పుస్తకాలను చదవాలి.
తెలంగాణలోని జాతరలు, పండుగలు, కళలు, సంస్కృతుల మీద అధిక ప్రశ్నలు.
ముల్కీ ఉద్యమం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, 8 సూత్రాల పథకాలను బాగా చదవాలి.
టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు, వివిధ పార్టీల పాత్ర, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, వివిద సంఘాల పాత్ర, కవులు, కళాకారుల పాత్రలపై ప్రశ్నలు అడుగుతారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమలుకాని హామీలను క్షుణ్ణంగా చూడాలి.

జాతీయోద్యమంలో ఇవి తప్పనిసరి
ఆర్యసమాజ్, రాజరామ్‌మోహన్ రాయ్ చేసిన కృషి తదితర అంశాలు.
స్వాతంత్య్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన పాత్ర.
బ్రిటీష్ తిరుగుబాటు జరగక ముందు గిరిజనుల పోరాటం.
ముఖ్యంగా సంతాల్ తిరుగుబాటు.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర అంశాలపై దృష్టి పెట్టాలి.
1920 దశాబ్దంలో జరిగిన సహాయనిరాకరణ ఉద్యమం, గాంధీజి పాత్ర.
1920 దశాబ్దంలో రాడికల్ టెర్రరిజం, సోషలిస్టు, కమ్యూనిస్టులు నిర్వచించిన విధానం.
గాంధీజి, బాలగంగాధర్ తిలక్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ మొదలగువారి గురించి ఒకసారి రివిజన్ చేసుకోవాలి.

ఇండియన్ పాలిటీ

రాజ్యాంగ తత్వం, పీఠికను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ప్రాథమిక హక్కుల మీద ప్రశ్న లేకుండా ప్రశ్నా పత్రం ఉండదు.
పుస్తకాల్లో ఉన్నది మాత్రమే.. కాకుం డా విశ్లేషణాత్మకంగా చదువుకుంటే మంచి మార్కులను సాధించవచ్చు.
న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలు ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లోకి వస్తున్నాయి. వాటిని తప్పకుండా కవర్ చేసుకోవాలి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం.

పృథ్వీకుమార్ చౌహన్
డైరెక్టర్, పృథ్వీస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News