Sunday, November 17, 2024

భార్య ఇన్ఫోసిస్ సంపదపై వ్యాఖ్యలు.. రిషి సునాక్ స్ట్రాంగ్ కౌంటర్..

- Advertisement -
- Advertisement -

లండన్: భారతీయులైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు తన అత్తమామలు సుధానారాయణ మూర్తి గురించి తానెంతో గర్వపడుతున్నానని బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్ పేర్కొంటూ తన భార్య అక్షత కుటుంబ ఆస్తిపై వచ్చిన మీడియా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వాడివేడిగా సాగిన టెలివిజన్ చర్చలో ఈ ఏడాది మొదట్లో అక్షత సంపద పన్ను వ్యవహారాలపై పతాక శీర్షికల్లో వచ్చిన వార్తపై ఆయన గట్టిగా స్పందించారు. భారత దేశంలో ఆమెకు ఇన్ఫోసిస్ నుంచి వచ్చే ఆస్తి వాటాలపై పన్ను చెల్లింపులను స్వచ్ఛందంగా వదులు కున్నారని, బ్రిటన్‌లో కూడా అలాగే సంపదపై పన్ను చెల్లింపులను వదులుకున్నారని రిషి సునాక్ వివరించారు. అందువల్ల తాను సాధారణ పన్ను చెల్లింపు దారునిగానే బ్రిటన్‌లో ఉంటున్నానని వివరించారు. తన భార్య మరో దేశం నుంచి వచ్చినందును ఆమె వ్యవహారాలు వేరుగా ఉంటాయన్నారు. అయినా వసంత కాలంలో ఈ సమస్యను పరిష్కరించుకున్నట్టు ఆమె వివరించిందన్నారు. నెం.11 డౌనింగ్ స్ట్రీట్‌లో కొన్ని నెలల పాటు ఛాన్సలర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు కొన్ని నెలలకు సునాక్ తన గ్రీన్ కార్డు హోదాపై నివేదిక ఇవ్వడం కూడా వివాదమైంది.

తన మామగారు నారాయణమూర్తి ఏమీ లేని స్థితి నుంచి వచ్చారని, తన అత్తవారిచ్చిన రెండు వందల పౌండ్ల పెట్టుబడితోనే తాను కలలు కన్న ప్రపంచ స్థాయి కంపెనీలను నెలకొల్పి, వేలాది మందికి బ్రిటన్‌లో ఉద్యోగాలు కల్పించడం తనకు గర్వకారణంగా ఉందని సునాక్ ప్రశంసించారు. ఈ విధంగా ఇక్కడ కూడా తాను ప్రధానిగా అనేకం సాధించగలనని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషి సునాక్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తేలింది. ముఖ్యంగా రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికైతే మంచి ప్రధానిగా ఉండగలరనే విశ్వాసం వ్యక్తం చేసినట్టు ఆదివారం వెల్లడైన ఒపీనియన్ పోల్స్ పేర్కొన్నాయి. పోల్‌లో పాల్గొన్న 1001 మందిలో 24 శాతం మంది రిషి సునాక్‌కే మద్దతు ప్రకటించగా, 19 శాతం మంది విదేశాంగ మంత్రి టామ్ టుగెంఢట్‌కు, 17 శాతం మంది వాణిజ్యమంత్రి పెన్నీ మార్డాంట్‌కు, 15 శాతం మంది విదేశాంగ మంత్రి లీజ్‌ట్రూజ్‌కు, మాజీ మంత్రి కెమి బదనోచ్‌కు 12 శాతం మంది మద్దతు ఇస్తున్నట్టు తేలింది.

Rishi Sunak hits back over his wife’s Infosys Wealth

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News