ఇద్దరు మృతి
ఆక్రా : ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రాణాంతకమైన ‘మార్బర్గ్’ వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10న పాజిటివ్‌గా తేలింది. అయితే ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సెనెగల్‌లోని ఇన్‌స్టిట్యూట్ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది’ అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది.