Monday, December 23, 2024

కేరళ ‘నీట్’లో కర్కశం

- Advertisement -
- Advertisement -

లోదుస్తులు విప్పితేనే పరీక్షకు అనుమతి

అధికారుల షరతుతో
విస్తుపోయిన విద్యార్థినులు
మహారాష్ట్రలో హిజాబ్‌పై వివాదం

మన తెలంగాణ/హైదరాబాద్: నీట్ పరీక్షలో ఓ విద్యార్థినిని లోదుస్తులు విప్పించి పరీక్షా హాల్‌లోకి అనుమతించిన ఘటన ఆదివారం నాడు కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్‌లోని మాత్రో మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కేంద్రంలో చోటుచేసుకుంది. ఈక్రమంలో బాధిత యువతి తన లోదుస్తులు తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు కోటరక్కరా డిప్యూటీ ఎస్‌పికి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా బయోమెట్రిక్ ఎజెన్సీ సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు ఫిర్యాదులో వాపోయింది. వివరాల్లోకి వెళితే..దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష రాసేందుకు బాధిత యువతి కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్‌లోని మాత్రోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కేంద్రానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పరీక్షా హాల్‌లోకి వెళుతుండగా బయోమెట్రిక్ ఎజెన్సీ సిబ్బంది ఆ యువతిని అడ్డుకున్నారు.

అనంతరం లోదుస్తులు విప్పాలని బలవంతం చేశారని, లోదుస్తులు తీసేసిన తర్వాతే తనను పరీక్షా హాల్‌లోకి అనుమతించారని తెలిపింది. తనతో పాటు చాలా మంది విద్యార్థునులను లోదుస్తులు తీసేసిన తరువాతే పరీక్ష రాసేందుకు అనుమతించారని వివరించంది. దీంతో మానసికంగా కృంగిపోయిన విద్యార్థునులు పరీక్ష సరిగా రాయలేకపోయారనని ఫిర్యాదులో వివరించింది. పరీక్ష పూర్తైన తర్వాత పెద్ద ఎత్తున లోదుస్తులను ఓ అట్ట పెట్టెలో కళాశాల సిబ్బంది బయట పడేసినట్లు కొందరు విద్యార్థులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మాకు సంబంధం లేదుః

నీట్ పరీక్షలో విద్యార్థిని లోదుస్తులు విప్పించిన ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదని మాత్రోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజమాన్య వివరించింది. విద్యార్థులను బయోమెట్రిక్ తనికీలు చేపట్టి లోపలికి అనుమతించే బాధ్యత ఏజెన్సీలదేనని పేర్కొంది. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులను విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఆరోపించారని పేర్కొంది.

మహారాష్ట్రలో మరో తతంగం 

మహారాష్ట్ర వాశిం జిల్లాలోని మాతోశ్రీ శాంతాబాయి గోటె కళాశాలలో ఇద్దరు ముస్లిం విద్యార్థినులు నీట్ పరీక్ష రాసేందుకు హిజాబ్ ధరించి రావడంతో ఎజెన్సీ సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ తీసేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. హిజాబ్ తీసేయకపోతే కత్తెరతో కత్తిరిస్తామని బెదిరించినట్లు చెప్పారు. తమతో వచ్చిన తల్లిదండ్రులతోనూ ఎజెన్సీకి చెందిన అధికారులు వాదనలకు దిగారని విద్యార్థినులు పేర్కొన్నారు.ఈ ఘటనపై బాధిత యువతుల తల్లిదండ్రులు పోలీసులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News