ఇండియన్ పాలిటి స్పెషల్ 7
రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు
(ఆర్టికల్ 3651)
రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి.
వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాం.
ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అని అంబేద్కర్ వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 36: రాజ్యం గురించి నిర్వచిస్తుంది.
ఆర్టికల్ 37: వీటికి న్యాయ సంరక్షణ లేదు. కానీ ప్రభుత్వాలు చట్టం ద్వారా అమలు చేయవచ్చు.
ఆదేశసూత్రాలను 3 రకాలుగా విభజించవచ్చు. అవి
1. ఉదార వాద నియమాలు (44, 49, 50, 51)
2. గాంధేయ వాద నియమాలు (40, 43, 47, 48)
3. సామ్యవాద నియమాలు (38, 39, 41, 43, 46, 42)
ఉదార వాద నియమాలు
ఆర్టికల్ 44: ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్)
వివిధ మతస్థులకు వేరువేరు చట్టాలు ఉండటం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి పౌరసత్వం అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా.
ఆర్టికల్ 49: ప్రాచీన వాస్తు శిల్ప సంపదను రక్షించాలి.
ఆర్టికల్ 50: ఎగ్జిక్యూటివ్ నుంచి జుడిషియల్ సిస్టమ్‌ను వేరు చేయాలి.
ఆర్టికల్ 51: అంతర్జాతీయంగా శాంతిని పెంపొందించడం.
ఈ నిబంధన భారత విదేశాంగ విధానంను తెలుపుతుంది.
2వ ప్రపంచ యుద్ధం అనంతరం ఇంగ్లాండ్ ఆధిపత్యం అంతరించింది.
కొత్తగా అమెరికా, యూఎస్‌ఎస్‌ఆర్ ఆవిర్భవించినప్పటికీ ఇండియా తటస్థంగా వ్యవహరించింది.
ఇలా తటస్థంగా ఉండే విధానాన్ని అలీన విధానం అంటారు.
దేశ విదేశాంగ విధానాన్ని నెహ్రూ రూపొందించారు.
గాంధేయవాద నియమాలు
(40,43,47,48):
ఆర్టికల్ 40: గ్రామ పంచాయితీల ఏర్పాటు.
73వ సవరణ ద్వారా పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఇందులో 29 అంశాలున్నాయి.
గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీజీ ఆకాంక్షించారు.
ఆర్టికల్ 43: వ్యక్తి పరంగా లేదా సామాజిక పరంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం ఖాధీబోర్డ్ ఏర్పాటు చేసింది.
ఆర్టికల్ 47: ప్రజారోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలది. మత్తు పదార్థాలు, మధ్యపానం నిషేదించాలి.
ఇండియాలో తొలిసారిగా కేరళ రాష్ట్రం మద్యపానాన్ని పూర్తిగా నిషేదించాలి.
ప్రస్తుతం మద్యపాన నిషేదం అమలులో ఉన్న రాష్ట్రం బిహార్.
ఆర్టికల్ 48: పాడిపశువుల అభివృద్ధి, గోవద నిషేదం.
పెంపుడు, అటవి జంతువుల రక్షణ గురించి ఈ నిబంధన పేర్కొంటుంది.
సామ్యవాద నియమాలు
సమసమాజ స్థాపనే సామ్యవాద లక్షం.
ఆర్టికల్ 38: ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అందించాలి. (సంక్షేమ రాజ్యం)
నోట్: ప్రాథమిక హక్కులు కేవలం రాజకీయ హక్కును కల్పిస్తాయి. ఆర్థిక, సామాజిక రాజకీయ న్యాయాలు కల్పిస్తున్న రాజ్యంను శ్రేయోరాజ్యం అని అంటారు.
ఆర్టికల్ 39: ప్రభుత్వాలు ఈ కింది నిబంధనలు అమలు చేయాలి.
39(a)ఉచిత న్యాయం అందించాలి.
39(b) దేవ సంపద, సహజ వనరులు ప్రజలందరికి పంచాలి.
39(c) దేశ సంపద సహజ వనరులు ఏ ఒక్కరివద్ద కేంద్రీకృతం కాకూడదు. వికేద్రీకరణ చేయాలి.
ఆర్టికల్ 41: జీవనోపాధి కల్పించాలి. పనిహక్కు కల్పించాలని అర్థం.
ఆర్టికల్ 42: మహిళలకి ప్రసూతి సౌకర్యం కల్పించాలి.
కార్మికులకు హేతుబద్దమైన పనిగంటలు, పని చేసే వాతావరణం కల్పించాలి.
ఆర్టికల్ 43
43(a)- కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలి.
43(b) సహకార సంస్థలు స్థాపించాలి
ఆర్టికల్ 45: ఆరేళ్లలోపు బాలబాలికలకు విద్య అందించాలి.
ఈ అంశం 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో 21(A) చేర్చారు.
ఆర్టికల్ 21(A): 6 14 ఏళ్లలోపు పిల్లలకి ఉచిత నిర్భంద విద్య అందించాలి.
దీనిని అమలు బాధ్యత ప్రభుత్వాలది.
51(A) 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఉచిత విద్యను అందించడం తల్లిదండ్రుల విధి. (ఈ అంశం ప్రాధమిక విధుల్లో పేర్కొన్నారు)
ఆర్టికల్ 45: 6 ఏళ్లలోపు పిల్లలకి ఉచిత నిర్భంద విద్య.
ఆర్టికల్ 46: సామాజిక పరంగా, విద్య పరంగా వెనుకబడిన వారికి ప్రత్యేక మినహాయింపులు కల్పించాలి.
ఆదేశిక సూత్రాల లక్షణాలు
సంక్షేమ రాజ్య స్థాపన
శ్రేయోరాజ్య స్థాపన
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
ప్రభుత్వాలకి చట్టాలు రూపొందించడంలో సలహాలు.
ప్రభుత్వాలకి మార్గదర్శకాలు.
చట్టం ద్వారా అమల్లోకి వస్తాయి.
న్యాయ సంరక్షణ లేదు (39(b), 39(c)).
రాజ్యాంగంలో ఇతర భాగాల్లోని హక్కులు
ఆస్తి హక్కు
1978లో 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లోనుంచి తొలగించి 12వ భాగంలో 300(A) ఆర్టికల్ వద్ద చట్టబద్దమైన హక్కుగా లేదా న్యాయబద్దమైన హక్కుగా చేర్చారు.
ఓటు హక్కు
ప్రస్తుత ఓటుహక్కు వయసు 18 ఏళ్లు.
61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓటుహక్కు వయసు 21 నుంచి 18కి కుదించింది.
రాజకీయ హక్కు
ఓటువేయడం
ఎన్నికల్లో పోటీ చేయడం
ప్రభుత్వంను ఏర్పాటు చేయడం