Saturday, November 23, 2024

పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ

- Advertisement -
- Advertisement -

ప్రకాశం శర్మ ఆశయసాధనకు కృషి చేయాలి

సిపియం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్

మన తెలంగాణ/మోత్కూరు: పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన నాయకుడు ప్రకాశం శర్మ అని ఆయన ఆశయ సాధనకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రిటైర్డు ప్రిన్సిపాల్, సిపిఎం సీనియర్ నాయకుడు మోత్కూరు నరహరి శాస్త్రీలు అన్నారు. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం సిపిఎం నాయకుడు ప్రకాశం శర్మ 6వర్దంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్మారక స్థూపం వద్ద జెండాను ఎగురవేసి, చిత్రపటానికి పూల మాలలు వేసి నాయకులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషిచేసిన నాయకుడు ప్రకాశం శర్మ అని స్మరించుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మతం, మతోన్మాదం పేరుతో లౌకిక వాదాన్ని దెబ్బతీస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతూ అణిచివేయాలని చూస్తుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో లోపం ఉందని విమర్శించారు.

2014 వరకు ఎవరికీ తెలియని ఆదాని నేడు అంబానీని మించిపోయారని, కేంద్రం వ్యవయరంగాన్ని కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. సామాన్య, మద్య తరగతి ప్రజలపై భారంమోపేలా కేంద్రం పాలు వంటి అనేక వస్తువులు, ఆహార పదార్ధాలపై జిఎస్ టి పేరుతో పన్నులు వేస్తుందని అన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నాయని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి మాండ్ర చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి, రాచకొండ రాములమ్మ, గడ్డం వెంకటేశం, మోత్కూరు, గుండాల, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండల కార్యదర్శులు గుండు వెంకట్‌నర్సు, మద్దెపురం రాజు, వేముల భిక్షపతి, బుర్రు అనిల్‌కుమార్, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, సిపిఐ జిల్లా నాయకులు పైళ్ళ యాదిరెడ్డి, నాయకులు సుదర్శన్, చింతల కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, తిరుపతిరెడ్డి,అంజయ్య, వీరస్వామి, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశం శర్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News