Monday, December 23, 2024

నామినేషన్ దాఖలు చేసిన ప్రతిపక్ష ఉపాధ్యక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వా

- Advertisement -
- Advertisement -
Margaret Alwa
వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఉపరాష్ట్రపతి వారసుడిని ఎన్నుకునేందుకు ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ అల్వా మంగళవారం తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయగా, ఆమె వెంట పలువురు నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ, ఎన్‌సీపీకి చెందిన శరద్ పవార్, సిపిఐ-ఎం సీతారాం ఏచూరి, సిపిఐకి చెందిన డి. రాజా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆమె వెంట ఉన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల సమర్పణకు మంగళవారం చివరి తేదీ. “ఇది నిస్సందేహంగా కఠినమైన ఎన్నిక, కానీ సవాలును స్వీకరించడానికి నేను భయపడను” అని ఆమె సోమవారం అన్నారు. మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సాయంత్రం నామినేట్ అయిన తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఎన్‌డిఎకు చెందిన జగ్‌దీప్ ధన్‌ఖర్‌తో… 80 ఏళ్ల అల్వా పోటీ పడుతున్నారు. రాజస్థాన్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత అల్వా ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నామినేటెడ్ సభ్యులు సహా లోక్‌సభ, రాజ్యసభలోని ఎంపీలందరూ ఉపరాష్ట్రపతి ఎన్నిక ‘ఎలక్టోరల్ కాలేజీ’లో ఉంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News