- Advertisement -
వరంగల్: దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ నెల 11 తేదీన బొలేరో వాహనాన్ని నిందితులు అడ్డుకుని చోరీ చేశారు. వాహనంతో పాటు డ్రైవర్ వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు. చోరీ కేసులో అరెస్టయిన ముగ్గురూ డిగ్రీ విద్యార్థులుగా గుర్తించారు. యువకులు జల్సాలకు అలవాటు పడి చోరీకి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -