Saturday, December 21, 2024

బిజెపిపై మంత్రి హరీశ్ రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Fires On MP Bandi Sanjay

 

హైదరాబాద్: బిజెపిపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగాల విషయంలో బండి సంజయ్ పార్లమెంటులో నిలదీయమని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 16.5 లక్షల ఉద్యోగాలు యువతకు దక్కేలా చేయాలని సవాల్ విసిరారు. ఏం ముఖం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతారు. మిమ్మల్ని చూస్తే గొస అనిపిస్తున్నది. చేసింది ఏం లేదు… చేసేది ఏం లేదు… ఉద్యోగాలు ఇస్తున్నది తెలంగాణ అయితే, ఉన్నవి ఊడగొడితున్నది బీజెపీ అని విమర్శించారు. యువత కోసం బిజెపి ఏం చేసింది. వాళ్ల మాటలు కోటలు దాటుతాయు. యువత అలోచించాలి. 50 వేల మంది ఉద్యోగాలు తొలగించారు. 16.50 లక్షల ఉద్యోగాలు ఉన్నా నింపడం లేదు. పార్లమెంట్ లో అడుగమన్నారు. కేంద్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అవి నింపితే మా తెలంగాణ యువతకు కొందరికైనా ఉద్యోగాలు రావా.. మిలటరీలో చేరాలంటే ఆశల మీద నీళ్లు చల్లారు. అగ్నిపథ్ పేరిట యువత జీవితాలతో కేంద్రం ఆటలాడుతున్నది. యువత శక్తి నిర్వీర్యం చేస్తున్నది. కులం, మతం పేరిట చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే యోచన తప్ప ఏం లేదని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఎమోషన్స్ తో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరులో పోలీసు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్ కల్పించారు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 91 వేల ఉద్యోగాల నియామకాలు చేస్తున్నాము. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News